ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాగ్రత్త.. ముక్కు జోలికెళితే కరోనా ఎటాక్ గ్యారెంటీ!

ABN, First Publish Date - 2021-01-05T03:01:29+05:30

ముక్కు నలిపితే కరోనా ఎటాక్ తప్పదు..శాస్త్రవేత్తల వార్నింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మనం అనేక మంది నిత్యం ఏదోక సందర్భంలో ముక్కు నలుపుకుంటారు..ఏదాలపంగా వేళ్లు లోపలికి పోనిస్తారు. ఎవరైనా గమనిస్తున్నారని అనిపిస్తే వేంటనే సర్దుకుని తిన్నగా కూర్చుంటారు. చూసే వాళ్లకు ఇబ్బందిగా ఉంటుందని తెలిసినా అప్పుడప్పుడూ పొరపాటునో గ్రహపాటునో కొందరు ఇలా చేసేస్తుంటారు. ఒకానొక సర్వే ప్రకారం.. ప్రపంచ జనాభాలోని 91 శాతం మంది ఏదోక సమయంలో ఈ పని చేస్తారని తేలింది. అయితే..ప్రస్తుత కరోనా కాలంలో ఈ అలవాటు ఉన్న వాళ్లు తక్షణం తమ తీరును మార్చుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


మ్యూకస్ అనే చిక్కని పదార్థం నిరంతరం ముక్కులో ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాశికా రంధ్రాల్లో ఇది నిరంతరం తయారవుతూ దుమ్ము, ధూళీ, ఇతర వ్యాధి కారక క్రిములను బంధించి ఎటూకదలకుండా చేస్తుంది. అయితే..ముక్కులో వేళ్లు పెట్టుకోవడం వల్ల కొన్ని సార్లు అక్కడ కంటికి కనిపించని గాయాలవుతాయి. దీంతో..అప్పటివరకూ సూక్ష్మ క్రిములకు అడ్డుగా ఉన్న మ్యూకస్ కూడా తొలగిపోతుంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కణాలు కూడా రక్తణాళాల్లోకి ప్రవేశించి అటుపై..ఊపిరితిత్తులను చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి.. ఇటువంటి అలవాటు ఉన్న వారు కరోనా కాలంలో జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.


Updated Date - 2021-01-05T03:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising