ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు నైట్ గార్డు... నేడు ఐఐఎం ప్రొఫెసర్... రామచంద్రన్ విజయగాథ!

ABN, First Publish Date - 2021-04-11T17:03:53+05:30

జార్ఖండ్‌లోని ఐఐటీ రాంచీలో ఇటీవలే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: జార్ఖండ్‌లోని ఐఐటీ రాంచీలో ఇటీవలే రంజీత్ రామచంద్రన్ నూతన అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా నియమితులయ్యారు. రామచంద్రన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, వాటిని దాటుకుంటూ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వైనం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఒకానొకప్పుడు నైట్ గార్డుగా పనిచేస్తూ రామచంద్రన్ కుంటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. రంజీత్ రామచంద్రన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని అతని పునాథుర్ గ్రామానికి చెందినది. 


ఈ ఫొటోలో ఒక పూరి గుడిసె కనిపిస్తుంది. 28 ఏళ్ల ఈ ప్రొపెసర్ ఆ ఫోటో కింద క్యాప్షన్‌గా ‘ఒక ఐఐటీ ఫ్రొఫెసర్ పుట్టిన ఇల్లు ఇది’ అని రాశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దీనికి ముందు రంజీత్ బెంగళూరులో క్రైస్ట్ యూనివర్శిటీలో రెండు నెలల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా రంజీత్ మాట్లాడుతూ విజయం కోసం పోరాడుతున్న వారికి తన జీవితం స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాని అన్నారు. తాను 12 వ తరగతి పూర్తి చేశాక చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించానన్నారు. ఆ సమయంలో బీఎస్ఎన్ఎల్ టెలీఫోన్ ఎక్స్ఛేంజిలో నైట్‌ గార్డుగా నాలుగు వేల రూపాయల జీతానికి పనిచేశానన్నారు. ఇలా ఉద్యోగం చేస్తూనే ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశానని తెలిపారు. 

Updated Date - 2021-04-11T17:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising