ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెదర్ రిపోర్టు చెబుతున్న న్యూస్ యాంకర్... ఉన్నట్టుండి వెనుక స్క్రీన్‌పై ఆ వీడియో ప్రసారం.. ఏంటిది? అంటూ గగ్గోలు పెట్టిన ప్రేక్షకులు

ABN, First Publish Date - 2021-10-21T18:02:36+05:30

మనమంతా దేశవిదేశాల విశేషాలు తెలుసుకునేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనమంతా దేశవిదేశాల విశేషాలు తెలుసుకునేందుకు వార్తలను చూస్తుంటాం. అందరూ ఎంతో ఆసక్తిగా చూసే వార్తల్లో ఏదైనా పొరపాటు చోటుచేసుకుంటే.. ఇక సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతుంటాయి. ఇటువంటి వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఇటువంటి ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అమెరికాకు చెందిన ఒక న్యూస్ ఛానల్‌లో ఈ గందరగోళం చోటుచేసుకుంది. 


వాషింగ్టన్‌లోని కేఆర్ఈఎం న్యూస్ ఛానల్ లో యాంకర్.. వాతావరణ విశేషాలు చెబుతుండగా ఉన్నట్టుండి వెనుక స్క్రీన్‌పై పోర్న్ వీడియో ప్రసారమయ్యింది. దీంతో ప్రేక్షులు కంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే.. వెనుక స్క్రీన్ పై ఏమి ప్రసారమవుతున్నదో కూడా గమనించకుండా ఆ యాంకర్ వాతావరణ విశేషాలను పూర్తిగా చదివారు. ఆ సమయంలో ప్రేక్షకులు తాము ఏమి చూస్తున్నామో తెలియక అయోమయానికి గురయ్యారు. ఒక గంట తరువాత జరిగిన పొరపాటును గ్రహించిన సదరు చానల్ నిర్వాహకులు ప్రేక్షకులను క్షమాపణలు కోరారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఉదంతంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-10-21T18:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising