ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడే పుట్టిన పాప.. పొట్ట ఎత్తుగా ఉండటంతో అనుమానం.. స్కానింగ్ రిజల్ట్ చూసి నివ్వెరపోయిన డాక్టర్లు..

ABN, First Publish Date - 2021-07-31T22:20:10+05:30

ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు. మళ్లీ గర్భం దాల్చింది. హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ఆమెకు స్కానింగ్ చేసిన డాక్టర్లకు ఆమె గర్భంలోని శిశువు కొంచెం తేడాగా కనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు. మళ్లీ గర్భం దాల్చింది. హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ఆమెకు స్కానింగ్ చేసిన డాక్టర్లకు ఆమె గర్భంలోని శిశువు కొంచెం తేడాగా కనిపించింది. ముఖ్యంగా ఆ శిశువు కడుపు ఎత్తుగా కనిపించింది. ఎందుకని అలా ఉందో డాక్టర్లకు అర్థం కాలేదు. దీంతో వాళ్లు డెలివరీ అయ్యే వరకూ వెయిట్ చేయక తప్పలేదు. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో సదరు మహిళ డెలివరీ జరిగింది. పండంటి ఆడపిల్ల పుట్టింది. ముద్దుగా ఉన్న ఆ పాప పొట్ట మాత్రం ఎత్తుగా ఉంది. అలా ఎందుకు ఉందో తెలుసుకోవడం కోసం వెంటనే ఆ పసిగుడ్డుకు స్కానింగ్‌ తీశారు.


ఇజ్రాయెల్‌లోని ఆష్డాడ్‌లోని ఒక ఆస్పత్రిలో ఈ పాప పుట్టింది. ఆ పాప కడుపు ఎత్తుగా ఉండటంతో స్కానింగ్ తీసిన డాక్టర్లు షాకైపోయే విషయం వెలుగు చూసింది. అదేంటంటే.. ఆ పసిగుడ్డు కడుపులో మరో పిండం ఉంది. ఇలా చాలా అరుదుగా జరుగుతుందని, సుమారు 5లక్షల శిశువుల్లో ఒక్క శిశువుకు ఇలా జరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. గర్భంలో కవలలు ఉండగా, ఒక పిండంలోకి మరో పిండం వెళ్లిపోయి ఉండొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ఒక శిశువు శరీరం తయారయ్యే సమయంలో రెండో పిండం పొరబాటున మొదటి పిండంలో చేరిపోవడం కూడా జరిగుండొచ్చట. అయితే ఈ పాప కడుపులో ఒకటి కాదు రెండు పిండాలు కనిపించాయని డాక్టర్లు చెప్పారు. రెండు పిండాలను తాము తొలగించామని, ఇంకా ఏమైనా ఉండే అవకాశం ఉందేమో అని చూస్తున్నామని వైద్యులు చెప్పారు. 


అయితే పాప కడుపులోని పిండం సాధారణ పిండంలా లేదని తెలిపారు. కేవలం కొన్ని ఎముకలు, ముఖం మాత్రమే కనిపించాయని, మిగతా శరీరం అభివృద్ధి జరగలేదని వివరించారు. ఏది ఏమైనా ఇలా వైద్య శాస్త్ర చరిత్రలో జరగడం చాలా అరుదని అంటున్నారు.

Updated Date - 2021-07-31T22:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising