ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎప్పటికీ ఆశ కోల్పోవద్దు...helicopter ప్రమాదం నుంచి బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ లేఖ

ABN, First Publish Date - 2021-12-10T16:45:08+05:30

మిలటరీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ సెప్టెంబరు నెలలో హర్యానాలోని చండీమందిర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు రాసిన లేఖలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  మిలటరీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడిన భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ సెప్టెంబరు నెలలో హర్యానాలోని చండీమందిర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు రాసిన లేఖలో విద్యార్థులకు సందేశం ఇచ్చారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, బోధకులు, సహచరులకు కృతజ్ఞతలు తెలుపుతూ వరుణ్ సింగ్ లేఖ రాశారు. తమిళనాడులో కూలిపోయిన మిలటరీ హెలికాప్టర్ నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి వరుణ్ సింగ్ బెంగళూరులో కమాండ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ‘‘ఈ హైపర్ కాంపిటీటివ్ ప్రపంచంలో కేవలం మధ్యస్థంగా ఉండాలని భావించే పిల్లలను ప్రేరేపించవచ్చని నేను భావిస్తున్నాను. అందుకే నా జీవితం గురించిన ఆలోచనలను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను.’’ అని గ్రూప్ కెప్టెన్ తన లేఖలో రాశారు. 


తన గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఈ లేఖ రాయడం లేదని భవిష్యత్తులో పిల్లలకు నా జీవిత అనుభవాలను తెలియజేసేందుకే లేఖ రాశానని పేర్కొన్నారు. ‘‘నేను 12వతరగతి చదువు తున్నపుడు చదువు,క్రీడల్లోను సగటు విద్యార్థినేనని, కాని నాకు విమానయానం పట్ల మక్కువ ఉండేదన్నారు.’’‘‘మీరు మధ్యస్థంగా ఉండవచ్చు, కానీ జీవితంలో రాబోయే విషయాలకు ఇది కొలమానం కాదు’’ అని వరుణ్ లేఖలో చెప్పారు. ‘‘మీకు కళలు, సంగీతం, గ్రాఫిక్ డిజైన్,సాహిత్యం మొదలైనవి ఏవైనా రంగంలో ఆసక్తి ఉండవచ్చు.   మీరు దేని కోసం పనిచేసినా, అంకితభావంతో ఉండండి, మీ వంతు కృషి చేయండి. నేను మరింత కృషి చేయగలనని భావించి ఎప్పుడూ పడుకోవద్దు’’అని వరుణ్ పేర్కొన్నారు. 


‘‘ఎప్పుడూ ఆశ కోల్పోవద్దు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దానిలో మీరు మంచిగా ఉండలేరని ఎప్పుడూ అనుకోకండి. ఇది సులభంగా రాదు, దీనికి కృషి అవసరం, సమయాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది.’’ అని విద్యార్థులకు వరుణ్ సింగ్ రాసిన లేఖలో స్ఫూర్తి సందేశం ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్ 12వతేదీన చేసిన శౌర్య చర్యకు గుర్తింపుగా ఈ ఏడాది ఆగస్టు 15న భారత రాష్ట్రపతి తనకు శౌర్య చక్ర పురస్కారాన్ని అందించారని వరుణ్ సింగ్ విద్యార్థులకు రాసిన లేఖలో వివరించారు. 


Updated Date - 2021-12-10T16:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising