ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బాబోయ్.. ఇదేం వింత.. చేపను కత్తితో కోయగానే లోపల కనిపించిన సీన్ చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..!

ABN, First Publish Date - 2021-11-12T00:21:45+05:30

చేపను కోయగానే లోపల ఎలా ఉంటుందనే ప్రశ్న అసలు తలెత్తదు. ఎందుకంటే.. ఏ చేపను కోసినా లోపల ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేపలు రకరకాలుగా ఉంటాయి. అలాగే వాటి ధరల్లో కూడా తేడా ఉంటుంది. సాల్మన్ ఫిష్, అపోలో ఫిష్‌తో పాటూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దొరికే కొరమీను, పులస, బొచ్చె, బుడ్డపర్క తదితర చేపలు అందరికీ తెలిసిందే. అయితే వీటిలో పులస, కొరమీను తదితర చేపలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే.. ఏ చేపను తీసుకున్నా పైన, లోపల దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, మనం ఇప్పుడు చూడబోయే చేపను.. బహుశా చాలా మంది చూసుండరు. అంత విచిత్రంగా ఉందీ చేప. ఈ చేప పైకి ఒకే విధంగా ఉన్నా లోపల చూస్తే మాత్రం షాక్ అవుతారు.


చేపను కోయగానే లోపల ఎలా ఉంటుందనే ప్రశ్న అసలు తలెత్తదు. ఎందుకంటే.. ఏ చేపను కోసినా లోపల ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి చేపను తీసుకొచ్చి కత్తితో కోయడం మొదలెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తర్వాతే వారికి షాకింగ్ సీన్ కనిపించింది. చేపను కోసి చూడగా లోపల ఆశ్చర్యంగా మొత్తం నీలం రంగు కనిపించింది. లింగ్‌కోడ్ అనే పేరు గల ఈ చేపలన్నీ ఈ విధంగానే ఉంటాయట. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. చేప మాంస ప్రియులను ఇది మరింతగా ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి మరి.



Updated Date - 2021-11-12T00:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising