ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీ భర్తకు యాక్సిడెంట్ అంటూ అర్ధరాత్రి షాకింగ్ న్యూస్.. మేనల్లుడేగా అని నమ్మి ఆ కుర్రాళ్లతో ఆమె బైక్‌పై వెళ్తే..

ABN, First Publish Date - 2021-07-29T21:55:47+05:30

అర్ధరాత్రి తలుపుతట్టి మామయ్యకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు.. అది నిజమని నమ్మిన మహిళ వారితో కలిసి బయలుదేరింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్ధరాత్రి తలుపుతట్టి మామయ్యకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు.. అది నిజమని నమ్మిన మహిళ వారితో కలిసి బయలుదేరింది.. అయితే వారు ఆమెను హాస్పిటల్‌కు కాకుండా అడవిలోకి తీసుకెళ్లారు.. ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.. అయినా ఆ మహిళ విషయం ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది.. దాన్ని ఆసరాగా తీసుకున్న యువకులు ఆమెను వేధించడం మొదలుపెట్టారు.. దీంతో ఆమె భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన తాజాగా జరిగింది. 


భారత్ మార్కెట్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త రాత్రిపూట ఆటో నడుపుతుంటాడు. ఆమె ఇంటికి ఎదురుగానే భర్త సోదరి కుటుంబం నివసిస్తోంది. రెండు నెలల క్రితం అర్ధరాత్రి తలుపుకొట్టిన మేనల్లుళ్లు అరవింద్, సోనూ.. మామయ్యకు యాక్సిడెంట్ అయిందని సదరు మహిళకు చెప్పారు. వారు చెప్పింది నిజమని నమ్మని మహిళ.. భర్తను చూసేందుకు వారితో కలిసి బైక్‌పై బయల్దేరింది. అయితే వారు ఆమెను ఆస్పత్రికి కాకుండా అడవిలోకి తీసుకెళ్లారు. 


ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఇంటి వద్ద వదిలేశారు. విషయం ఎవరికైనా చెబితే పరువు పోతుందనే భయంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. దానిని ఆసరాగా తీసుకున్న అరవింద్, సోనూ ఆమెను వేధించడం ప్రారంభించారు. తమతో సంబంధం కొనసాగించమని ఒత్తడి చేశారు. దీంతో సదరు మహిళ తన భర్తకు విషయం మొత్తం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.  

Updated Date - 2021-07-29T21:55:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising