ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్స్‌పై ఇంద్రధనస్సు.. నాసా క్లారిటీ!

ABN, First Publish Date - 2021-04-07T17:03:37+05:30

ఎండ కాస్తుండగా, వర్షం పడితే ఇంద్రధనస్సు ఏర్పడుతుందనేది మనందరికీ తెలిసిన విషయమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎండ కాస్తుండగా, వర్షం పడితే ఇంద్రధనస్సు ఏర్పడుతుందనేది మనందరికీ తెలిసిన విషయమే. నీటిపై కాంతి పరావర్తనం చెందితే అందమైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. భూ గ్రహంపై ఇంద్రధనస్సులు ఏర్పడడమనేది సర్వ సాధారణం. అయిత మన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై ఇంద్రధన్సులు ఏర్పడడం మాత్రం సాధారణం కాదు. అందులోనూ అంగారక గ్రహంపై ఇంద్రధనస్సు ఏర్పడడానికి అవకాశాలు తక్కువ. 


తాజాగా అంగారక గ్రహానికి సంబంధించిన మొదటి కలర్ ఫొటోను  అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆదివారం విడుదల చేసింది. మార్స్‌పై పరిశోధన కోసం నాసా పంపిన రొబోటిక్ హెలికాఫ్టర్ (పర్సీవరెన్స్ రోవర్) ఈ ఫొటోను తీసింది. అయితే ఆ ఫొటోలో కనిపించిన ఇంద్రధనస్సు అందరి దృష్టినీ ఆకర్షించింది. మార్స్ పైన రెయిన్ బో ఏర్పడినట్టు ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలు ఆ రెయిన్ బో గురించి నాసాను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు నాసా తాజాగా సమాధానం చెప్పింది. ``మార్స్‌పై ఉన్నది ఇంద్రధనస్సేనా?` అని చాలా మంది అడుగుతున్నారు. అది ఇంద్రధనస్సు కాదు. అక్కడ ఇంద్రధన్సులు ఏర్పడడం సాధ్యం కాదు. నీటి బిందువులపై కాంతి పరావర్తనం చెందితేనే ఇంద్రధనస్సులు ఏర్పడతాయి. కానీ అక్కడ తగినంత నీరు ఉండదు. అక్కడి శీతల పరిస్థితుల కారణంగా నీరు గడ్డకట్టి పోతుంది. కెమేరా లెన్స్‌పై కాంతి పడినందు వల్లే ఇంద్రధన్సస్సులా కనిపించింద`ని నాసా ట్వీట్ చేసింది. 



Updated Date - 2021-04-07T17:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising