ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొసళ్లు తిరిగే నీళ్లలో నగ్నంగా దర్శనమిచ్చిన వ్యక్తి.. అసలు విషయం తెలిసి జాలర్లు షాక్!

ABN, First Publish Date - 2021-01-07T01:17:44+05:30

ఆస్ట్రేలియాలోని డార్విన్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు ఓ చెట్టుమీద నగ్నంగా కూర్చున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డార్విన్: ఆస్ట్రేలియాలోని డార్విన్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు ఓ చెట్టుమీద నగ్నంగా కూర్చున్న వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. మొసళ్లు సంచరించే నీళ్లలో... ఒంటినిండా బురద, దోమ కాట్లతో సొక్కిపోయిన అతడు సాయం కోసం అర్థించడంతో దగ్గరికెళ్లి చేరదీశారు. తాను నాలుగు రోజులుగా ఇక్కడి మడ అడవుల్లో చిక్కుకుపోయాననీ.. నాలుగు రోజులుగా నత్తలనే ఆహారంగా తింటూ గడిపానని అతడు వారికి చెప్పుకొచ్చాడు. దీంతో జాలర్లు అతడికి ఓ జత బట్టలు, బీరు ఇచ్చి డార్విన్ నగరానికి తీసుకొచ్చారు. తీరా అతడిని ఆస్పత్రిలో చేర్పించగానే పోలీసులు బిలబిలమంటూ అక్కడికి రావడం చూసి జాలర్లు ముక్కున వేలేసుకున్నారు. ఆయుధాల దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు బెయిల్ మీద వచ్చి పరారయ్యాడంటూ పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. పలు నేరాల్లో అతడు ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాడని నార్తరన్ టెర్రిటరీ నార్తరన్ వాచ్ కమాండర్ లెన్ టర్నర్ ధ్రువీకరించారు. 

Updated Date - 2021-01-07T01:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising