ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైనికులను అడ్డుకునేందుకు.. మయన్మార్ మహిళల వింత ఎత్తుగడ!

ABN, First Publish Date - 2021-03-07T02:37:14+05:30

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరసన కొనసాగుతోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చిన నిరసన తెలుపుతున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేపిటా: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల నిరసన కొనసాగుతోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చిన నిరసన తెలుపుతున్నారు. వారిని అడ్డుకునేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు, సైన్యం వీధుల్లోకి రాకుండా అడ్డుకునేందుకు అక్కడి మహిళలు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు.


వీధుల్లోనూ, రోడ్లపైన అడ్డంగా తాళ్లు కట్టి వాటిపై మహిళల దుస్తులను ఆరేస్తున్నారు.  మయన్మార్‌లో మహిళల దుస్తుల కింది నుంచి నడిస్తే దురదృష్టం వెంటాడుతుందని నమ్మకం. దీంతో వాటి కింది నుంచి నడిచేందుకు ఎవరూ ఇష్టపడరు. ఇప్పుడు మయన్మార్ ప్రజలు ఇదే ఐడియాను ఉపయోగించి సైన్యాన్ని, పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 


మహిళలు రోడ్లపై ఆరేస్తున్న దుస్తుల్లో లోంగ్యీ (మహిళలు నడుముచుట్టు కట్టుకునే వస్త్రం, మన లుంగీలాంటిది)తోపాటు లోదుస్తులు కూడా ఉండడం గమనార్హం. లోంగ్యీ కింది నడిస్తే అదృష్టాన్ని కోల్పోతారన్నది సంప్రదాయ నమ్మకం. అందుకే వాటిని వీధుల్లో ఆరేస్తున్నట్టు సైన్యానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్న ప్రజలు తెలిపారు.


అయితే, ప్రస్తుత తరం దీనిని విశ్వసించకున్నప్పటికీ సైనికులు మాత్రం నమ్ముతారని, అది వారి బలహీనతని పేర్కొన్నారు. వారు కనుక ముందుకు రావాలని అనుకుంటే కనుక అందుకు చాలా సమయం పడుతుందని, అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు ఈ ఉపాయం తమకు బాగా పనికొస్తోందని వారు వివరించారు. 

Updated Date - 2021-03-07T02:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising