ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gas Cylinder గురించి మీకు తెలియని నిజాలివి.. ఈ మూడు అంకెల నెంబర్ వెనుక సీక్రెట్ తప్పక తెలుసుకోండి..!

ABN, First Publish Date - 2021-12-18T20:01:00+05:30

గ్యాస్ సిలిండర్ గురించి చాలా మందికి సరైన అవగాహన ఉండదు. గ్యాస్‌ను వాడుకోవడమే తప్ప దాని గూర్చి ఏ మాత్రం పరిజ్ఞానం ఉండదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్యాస్ సిలిండర్ గురించి చాలా మందికి సరైన అవగాహన ఉండదు. గ్యాస్‌ను వాడుకోవడమే తప్ప దాని గూర్చి ఏ మాత్రం పరిజ్ఞానం ఉండదు. దీని వల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్లు పేలిపోవడం చూస్తుంటాం. అలా ఎందుకు పేలతాయో కూడా తెలియదు. కానీ పేలినప్పుడు ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరుగుతుంటాయి. ఇదంతా గ్యాస్ సిలిండర్ గురించి సరైన అవగాహన లేకపోవడమే కారణం. అసలు గ్యాస్ సిలిండర్ ఎందుకు పేలుతుంది. గ్యాస్ సిలిండర్ వాడే విధానం తెలియకపోవడమే కారణమా? దాని గురించి సరైన రీతిలో గైడ్ చేయకపోవడమే కారణమా? అసలు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్యాస్ బండపై ఉండే ఈ మూడు అక్షరాల సీక్రెట్ తెలుసుకుంటే ప్రమాదం నుంచి బయటపడినట్లే..


ఒకప్పుడు చాలా మంది కట్టెల పొయ్యి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి గ్రామాల్లోనూ గ్యాస్ పొయ్యి వాడకం పెరిగింది. అయితే ఇక్కడొక విషయం ఏంటంటే మనం నిత్యం ఉపయోగించే వస్తువులకు ఎక్స్‌పైర్ డేట్ ఉన్నట్లే గ్యాస్ సిలిండర్లకు కూడా ఒక తేదీ ఉంటుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇది గమనించకుండానే వాడేస్తుంటాం. దీని వల్ల ప్రమాదాలను కొనితెచ్చుకుంటుంటాం. గ్యాస్ బండను ఎలా వాడాలి? ప్రమాదం జరగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.


గ్యాస్ బండ మీద ఎక్స్‌పైర్ డేట్ ఉంటే దాన్ని కనుగొనేది ఎలా? అయితే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. గ్యాస్ సిలిండర్‌పై మూడు అంకెలు ఉంటాయి. అవి ఏ, బీ, సీ, డీ అనే ఇంగ్లీషు అక్షరాలతో పాటు రెండు అంకెల నెంబర్ కాంబినేషన్‌తో ఉంటాయి. గ్యాస్ సిలిండర్‌పై ఇవి ముద్రింపడి ఉంటాయి. ఇక వాటి అర్థాలేంటో కూడా పరిశీలిద్దాం... ఏ, బీ, సీ, డీ అనే అక్షరాలు ఏడాదిలోని నెలలను సూచిస్తుంటాయి. A-అంటే జనవరి నుంచి మార్చి నెల వరకు అని అర్థం. B-అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అని అర్థం. C- అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అని అర్థమిస్తోంది. ఇక D-అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం చేసుకోవాలి.


ఇక ఆ అక్షరాలతో పాటు ఉండే సంఖ్య మాత్రం సంవత్సరాన్ని సూచిస్తుంది. ఏ, బీ, సీ, డీలు పక్కన ఉండే అంకెలను బట్టి ఎక్స్‌పైర్ డేట్‌ను తెలుసుకోవచ్చు. ఇక వాటి అర్థాలేంటో కూడా తెలుసుకుందాం. ఉదాహరణకు D-25 అని ఉంటే ఆ సిలిండర్ 2025వ సంవత్సరం డిసెంబర్ నెల వరకు పనిచేస్తుందని అర్థం. అప్పటివరకు ఆ బండను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఎలాంటి భయం అక్కర్లేదు. ఒక వేళ ఆ తేది గనుక దాటితే మాత్రం ఆ సిలిండర్‌ను వాడకూడదు. ఒకవేళ వాడితే సిలిండర్‌లో ఉండే వాయు పీడనం వల్ల బండ పగిలిపోవడమే కాకుండా పేలిపోయే ప్రమాదం ఉంది. కనుక గ్యాస్ సిలిండర్ వాడేటప్పుడు గానీ, తీసుకునేటప్పుడు గానీ బండ మీద ఉండే ఎక్స్‌పైర్ తేదీలను కచ్చితంగా గమనించాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా భద్రంగా ఉండొచ్చు.

Updated Date - 2021-12-18T20:01:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising