ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండోనేషియా మాజీ అధ్యక్షుడి కుమార్తె ఇస్లాం నుంచి హిందూమతంలోకి convert

ABN, First Publish Date - 2021-10-27T15:51:47+05:30

ప్రపంచంలోనే అత్యధిక ముస్లిమ్ జనాభా ఉన్న ఇండోనేషియా దేశ మాజీ అధ్యక్షుడి కుమార్తె అయిన సుక్మావతి సుకర్ణోపుత్రి ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యధిక ముస్లిమ్ జనాభా ఉన్న ఇండోనేషియా దేశ మాజీ అధ్యక్షుడి కుమార్తె అయిన సుక్మావతి సుకర్ణోపుత్రి ఇస్లాం నుంచి హిందూ మతంలోకి మారారు.69 ఏళ్ల సుక్మావతి సుధీవాడని ఆచారం ప్రకారం నిర్వహించిన సంప్రదాయ వేడుకలో హిందూ మతాన్ని స్వీకరించారు.బాలిలోని బులెలెంగ్ రీజెన్సీలో సుక్మావతి తన తండ్రి పేరు మీద ఉన్న సుకర్నో సెంటర్ హెరిటేజ్ ఏరియాలో ఈ మతమార్పిడి వేడుక జరిగింది.సుక్మావతి బాలినీస్ బామ్మ అయిన ఇడా అయు న్యోమన్ రాయ్ శ్రీంబెన్ హిందూ మతంలోకి మారాలనే ఆమె నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. బాలిలోని హిందూమతం భారతదేశంలో ఆచరించే హిందూ మతానికి భిన్నంగా ఉంటుంది.


హిందూ మతానికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలు, ఆచారాల గురించి సుక్మావతికి విస్తృతమైన జ్ఞానం ఉందని ఆమె న్యాయవాది మీడియాకు తెలిపారు. సుక్మావతి మత మార్పిడి ఆమె ధైర్యానికి ఉదాహరణ అని ఆమె సన్నిహితురాలు మీడియాకు చెప్పారు.సుక్మావతికి గత 20 సంవత్సరాలుగా హిందూమతం పట్ల ఆసక్తి ఉందని,ఆమె బాలిలోని ప్రధాన దేవాలయాలను సందర్శించారని, రామాయణం, మహాభారతం వంటి గొప్ప భారతీయ ఇతిహాసాలను కూడా చదివారని ఆమె సన్నిహితురాలు చెప్పారు. 


ఇండోనేషియా దేశ రాజకీయాల్లో సుక్మావతి కుటుంబం చురుకుగా వ్యవహరిస్తోంది. డచ్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం ఇండోనేషియా పోరాటంలో సుక్మావతి తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించారు. 1945లో దేశం స్వతంత్రంగా ప్రకటించిన తర్వాత ఆమె తండ్రి సుకర్ణో మొదటి అధ్యక్షుడయ్యాడు. సుకర్ణో 1967లో పదవీచ్యుతుడయ్యే వరకు 22 సంవత్సరాలు పనిచేశారు.సుక్మావతి  అక్క మెగావతి సుకర్ణోపుత్రి ఇండోనేషియా ఐదవ అధ్యక్షురాలు.మెగావతి స్వయంగా ఇండోనేషియా నేషనల్ పార్టీని స్థాపించారు.


Updated Date - 2021-10-27T15:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising