ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షకు ఆలస్యం... అయినా సంస్కృతంలో టాపర్... ముస్లిం యువతికి గోల్డ్ మెడల్!

ABN, First Publish Date - 2021-04-24T12:06:22+05:30

మతానికి చదువుకు సంబంధం ఉండదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: మతానికి చదువుకు సంబంధం ఉండదు. ఇది ఇప్పుడు మరోమారు రుజువయ్యింది. రాజస్థాన్‌లోని సవాయీ మాధేపూర్‌నకు చెందిన ముస్లిం యువతి అస్మత్ పర్వీన్... సంస్కృత వ్యాకరణ ఆచార్యలో గోల్డ్ మెడల్ అందుకోబోతున్న ఏకైక ముస్లిం యువతిగా నిలిచింది. ఇంతటి ఘన విజయం సాధించిన అస్మత్ పర్వీన్ పరీక్షా కేంద్రానికి ఐదు నిముషాలు లేటుగా వెళ్లింది. 


దీంతో ఆమెకు పరీక్ష రాసేందుకు అభ్యంతరం వ్యక్తమయ్యింది. అస్మత్ పర్వీన్ తొలుత మదరసాలో విద్యాభ్యాసం చేసింది. ఆమె తండ్రి మంజూర్ ఆలం శివ్రానీ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడు. తన ఏడుగురు సంతానాన్ని విద్యలో ప్రోత్సహించాడు. మూడవ సంతానమైన అస్మత్ పర్వీన్...మదరసాలో విద్యాభ్యాసం పూర్తిచేసిన అనంతరం ప్రైవేటు స్కూలులో చేరింది. తరువాత సంస్కృతం మీద ఇష్టంతో శాస్త్రి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. తరువాత సంస్కృత వ్యాకరణలో ఆచార్య కోర్సు పూర్తి చేసింది. అయితే పరీక్షలకు సమయానికి హాజరు కాలేకపోయింది. 10 నిముషాలు లేటుగా వెళ్లింది. దీంతో అధికారులు అభ్యంతరం తెలిపారు. అయితే ఎలాగోలా వారిని ఒప్పించి 25 నిముషాల అనంతరం పరీక్షకు కూర్చుంది. ఈ పరీక్షలో అస్మత్ పర్వీన్ టాపర్‌గా నిలిచింది. త్వరలో ఆమె యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకోనుంది.

Updated Date - 2021-04-24T12:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising