ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ కుబేరుడు గురించి ఆసక్తికర విషయం.. వెల్లడించిన తల్లి!

ABN, First Publish Date - 2021-03-04T10:43:14+05:30

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దీన్ని బయట పెట్టింది ఎవరో కాదు స్వయానా మస్క్ తల్లి మాయే మస్క్. ఎలన్ మస్క్ తన 17వ ఏట స్కూల్లో రాసిన పరీక్ష పేపర్‌ను ట్విట్టర్లో షేర్ చేసిన మాయే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దీన్ని బయట పెట్టింది ఎవరో కాదు స్వయానా మస్క్ తల్లి మాయే మస్క్. ఎలన్ మస్క్ తన 17వ ఏట స్కూల్లో రాసిన పరీక్ష పేపర్‌ను ట్విట్టర్లో షేర్ చేసిన మాయే.. ఆ పరీక్ష గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించింది. ‘‘నాకు సరిగ్గా గుర్తుంటే.. పరీక్షలో ఎక్కవ మార్కులు వచ్చినందుకు వాళ్లు నీకు మళ్లీ పరీక్ష పెట్టారు. అందుకే ఇంత గొప్ప ఇంజినీర్ అయ్యావంటే ఇందులో ఆశ్చర్యం కలగడం లేదు’’ అని ఆమె ట్వీట్ చేశారు.


ఈ ట్వీట్‌కు #ProudMom అనే హ్యాష్‌ట్యాగ్ జతచేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టెస్లా షేర్లు విపరీతంగా పెరగడంతో ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఎదిగిన సంగతి తెలిసిందే. స్పేస్‌ఎక్స్ సంస్థతో అంతరిక్ష రంగంలో కూడా ఆయన ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంగారకుడిపైకి మనుషులను పంపాలనే లక్ష్యంతో ఎన్నో పరిశోధనలు చేస్తున్నాడు.



Updated Date - 2021-03-04T10:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising