ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త సాగు టెక్నిక్: పండ్లకు మసాజ్ చేయాలి, సంగీతం వినిపించాలి!

ABN, First Publish Date - 2021-04-18T01:22:03+05:30

పంటలు బాగా పండాలి అంటే నీరు కావాలి, భూమిలో పోషకాలు దండిగా ఉండాలి! అంతేకాకుండా.. చీడ పీడలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే రైతు ఆశించిన విధంగా పంట చేతికి వస్తుంది. కానీ మలేషియా కంపెనీకి చెందిన ముగ్గురు రైతులు మాత్రం వీటితో పాటూ మసాజ్ చేయాలి అని అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పంటలు బాగా పండాలి అంటే నీరు కావాలి, భూమిలో పోషకాలు దండిగా ఉండాలి! అంతేకాకుండా.. చీడ పీడలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే రైతు ఆశించిన విధంగా పంట చేతికి వస్తుంది. కానీ మలేషియా కంపెనీకి చెందిన ముగ్గురు రైతులు మాత్రం వీటితో పాటూ మసాజ్ చేయాలి అని అంటున్నారు. అంతేకాకుండా.. సంప్రదాయ సంగీతం కూడా వినిపించాలట. ఆశ్చర్యంగా ఉంది కదూ.. జపాన్‌లో కనిపించే ఓరకమైన పుచ్చకాయలు(జపనీస్ మెలన్స్) మలేషియాలోనూ విరగ పండాలంటే ఇదే చేయాలని వారు చెబుతున్నారు. దాదాపు దశాబ్దం పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని కనిపెట్టారట. మెత్తని వస్త్రంతో వారు ఈ పుచ్చకాయలకు మసాజ్ చేస్తారు. ఈ విధానాన్ని అక్కడ టామా-ఫుకీ అని పిలుస్తారు. దీనికి తోడు ఆ మొక్కలకు సంప్రదాయ సంగీతం కూడా వినిపిస్తారట. 


ఇలా చేయడం వల్ల వాటి ఎదుగుదల భేషుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు. పండ్లకు మంచి రుచి కూడా వస్తుందంటున్నారు. మలేషియాకు చెందిన మోనో ప్రీమియమ్ అనే కంపెనీలో వారు ఈ పండ్లను పెంచుతున్నారు. కాగా.. ఈ పుచ్చకాయలకున్న రుచి కారణంగా ఇది అత్యధికధరలకు అమ్ముడుపోతుంటాయి. జపాన్‌లో సాధారణంగా శీతల వాతావరణంలో ఇవి పెరుగుతాయి. అయితే..భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న మలేషియాలో ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి..మలేషియా రైతులు జపాన్ సాగు పద్ధతులను అర్థం చేసుకుని ఆ తరువాత మలేషియా పరిస్థితులకు తగ్గట్టుగా వాటికి మార్పులు చేయడంతో పాటూ కొన్ని అదనపు విధానాలను జోడిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సాగు పద్ధతులకు మసాజ్, సంగీతాన్ని కూడా జోడించారు. 

Updated Date - 2021-04-18T01:22:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising