ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనిమనిషి చేతివాటం...50 సార్లు అరెస్ట్

ABN, First Publish Date - 2021-06-18T14:33:12+05:30

ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తున్న వనితా గైక్వాడ్ (38) చేతివాటం ప్రదర్శించి పోలీసు రికార్డులకు ఎక్కారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనిచేసిన ఇళ్లలోనే వరుస చోరీలు

ముంబై (మహారాష్ట్ర): ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తున్న వనితా గైక్వాడ్ (38) చేతివాటం ప్రదర్శించి పోలీసు రికార్డులకు ఎక్కారు. పనిచేస్తున్న ఇళ్లలోనే చేతివాటం చూపించి వరుస చోరీలకు పాల్పడ్డారు. తాజాగా వనితాగైక్వాడ్ తాను పనిచేస్తున్న ఇంట్లోనే 2,500 డాలర్లను దొంగిలించిందనే ఫిర్యాదుతో ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కరడుకట్టిన దొంగగా పేరొందిన వనితా పలుసార్లు తాను పనిచేసిన ఇళ్లలోనే చోరీలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు పలు చోరీ కేసుల్లో వనితా గైక్వాడ్ ను 50  సార్లు అరెస్ట్ చేశారు. 




పేరు మారుస్తూ ఇళ్లలో పని చేస్తానని చెప్పి చోరీలకు పాల్పడుతుందని పోలీసులు చెప్పారు. విలేపార్లే నివాసి అయిన ఫ్యాషన్ డిజైనర్ దీపిక గంగూలీ ఇంట్లో దొంగతనం కేసును జుహూ పోలీసులు విచారించగా చోరీ బాగోతం బయటపడింది. విఖ్రోలీలో వనితాను పోలీసుల అరెస్టు చేశారు. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారని, వారు వేర్వేరుగా నివశిస్తున్నారని పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలో వనిత చోరీ బాగోతం బయటపడింది. వనితా చోరీ చేసిన ఇళ్లను గుర్తించేందుకు వాచ్ మెన్లను సంప్రదిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-06-18T14:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising