ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో మొదటిసారి చిరుతపులికి రేడియో కాలర్

ABN, First Publish Date - 2021-02-22T13:41:12+05:30

ముంబై నగరంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కులో సావిత్రి అనే మూడేళ్ల వయసు గల చిరుతపులికి మొట్టమొదటిసారి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): ముంబై నగరంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కులో సావిత్రి అనే మూడేళ్ల వయసు గల చిరుతపులికి మొట్టమొదటిసారి రేడియో కాలర్ అమర్చి అడవిలోకి విడుదల చేశారు. బోరివాలిలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కులో ఉన్న చిరుతపులికి సావిత్రి అనే పేరు పెట్టారు. ఈ చిరుతపులి కదలికలను తెలుసుకునేందుకు వీలుగా రేడియో కాలర్ చేశామని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ జి మల్లికార్జున చెప్పారు. ఆరే కాలనీ, ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల అడవుల్లో సంచరిస్తున్న ఈ చిరుతపులికి రేడియో కాలర్ అమర్చడం ద్వారా వీటిని ట్రాక్ చేయనున్నారు. కాలర్ లు ఉపగ్రహానికి సంకేతాలు పంపి, చిరుతపులి ఎక్కడ ఉంది? ఏం చేస్తుందనేది తెలుస్తోందని అటవీశాఖ అధికారులు చెప్పారు.


చిరుతపులుల కదలికలను తెలుసుకునేందుకు వీలుగా ఐదు చిరుతపులులకు రేడియోకాలర్ ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు.గతంలో కెమెరా ట్రాప్ ల ద్వారా చిరుతపులుల కదలికలను తెలుసుకునేవారు. చిరుతల సంచారం గురించి తెలుసుకొని, అవి జనవాసాల్లోకి రాకుండా చేసేందుకు రేడియో కాలర్ లు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు వివరించారు.

Updated Date - 2021-02-22T13:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising