ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mumbai: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని, యువకుడు యువతికి ఎం పంపించాడంటే...

ABN, First Publish Date - 2021-09-10T16:51:12+05:30

పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో పొరుగింట్లోని యువతికి సెక్స్ టాయ్స్ పంపిన యువకుడి బాగోతం ముంబై నగరంలో వెలుగుచూసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో పొరుగింట్లోని యువతికి సెక్స్ టాయ్స్ పంపిన యువకుడి బాగోతం ముంబై నగరంలో వెలుగుచూసింది. మహారాష్ట్రలోని ముంబై నగరానికి చెందిన కునాల్ అంగోల్కర్ (27) తన పొరుగింట్లోని 21 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రతిపాదించాడు. పెళ్లి ప్రతిపాదనను యువతి కుటుంబం తిరస్కరించింది. తనతో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో కునాల్ నెలరోజుల పాటు ఈకామర్స్ వెబ్ సైట్ ల ద్వారా యువతి ఇంటికి సెక్స్ బొమ్మలు పంపించాడు. క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపు పద్ధతిలో యువతికి బొమ్మలు పంపించాడు.


దీంతో పాటు యువతి ఫోన్ నంబరును పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేశాడు. యువతి ఫిర్యాదు మేర మలాడ్ పోలీసులు ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి ముంబై పోలీసు సైబర్ సెల్ కు బదిలీ చేశారు. నిందితుడు చిరునామా ఎక్కడా పేర్కొనక పోవడంతో పోలీసులు వీపీఎన్ సమాచారంతో ఐపీ చిరునామాను గుర్తించారు. యువతికి బొమ్మలను ఆర్డర్ చేసి పంపిన కునాల్ ప్రతీసారి ఐపీ చిరునామాను మార్చాడు.దీంతో పోలీసులు 500 మంది సర్వీస్ ప్రొవైడర్లను స్కాన్ చేయడంతో అసలు నిందితుడు కునాల్ దొరికాడు. సాంకేతిక పరిశోధన గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సైబర్ సెల్ నిందితుడు కునాల్ అంగోల్కర్‌ను గుర్తించి అరెస్టు చేశారు.

Updated Date - 2021-09-10T16:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising