అంథేరీ స్టేషన్‌కు ఇంటిగ్రేటెడ్ వెలుగులు!
ABN, First Publish Date - 2021-06-28T12:46:08+05:30
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ...
ముంబై: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటైన ముంబైలోని అంథేరి స్టేషన్‌కు మెరుగులు దిద్దాలని ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అంథేరి స్టేషన్ ఇంటిగ్రేటెడ్ స్టేషన్‌గా మారనుంది. ఇందుకోసంమొత్తం 4.31 ఎకరాల్లో అభివృద్ధి పనులు జరగనున్నాయి. మొదటి దశలో 2.1 ఎకరాల్లో, రెండో దశలో మిగిలిన విస్తీర్ణంలో పనులు జరగనున్నాయి. మొదటి దశలో పునరాభివృద్ధి ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 218 కోట్లుగా నిర్ణయించారు. ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంథేరి స్టేషన్ పునర్‌నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
దీని ప్రకారం 21 వేల 843 చదరపు మీటర్లలో అంధేరి స్టేషన్‌ను పునర్‌నిర్మించనున్నారు. అంధేరి స్టేషన్ అభివృద్ధి పనులకు ఇప్పటికీ వెస్ట్రన్ రైల్వే నుంచి అనుమతి లభించింది. అంధేరి స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తయ్యాక స్టేషన్ ముఖద్వారం తూర్పు వైపునకు మరలనుంది. మెట్రో స్టేషన్లకు ఈ రైల్వే స్టేషన్‌తో అనుసంధానం ఏర్పడనుంది. ఇంతేకాకుండా స్టేషన్ వద్ద రద్దీని తగ్గించడానికి వెర్సోవా మార్గ్ రహదారి ప్రవేశం, డ్రాప్-ఆఫ్, పికప్ కోసం ప్రణాళిక సిద్ధం చేశారు.
Updated Date - 2021-06-28T12:46:08+05:30 IST