ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

farmerను వరించిన అదృష్టం...రాత్రికి రాత్రి లక్షాధికారి అయిన వైనం

ABN, First Publish Date - 2021-12-07T13:29:48+05:30

మధ్యప్రదేశ్ రైతుకు అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రి లక్షాధికారి అయ్యాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రైతుకు అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రి లక్షాధికారి అయ్యాడు.మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన రైతు ములాయం సింగ్ సోమవారం తవ్వకాలు జరుపుతుండగా రూ.50 లక్షలకు పైగా విలువైన 13 క్యారెట్ల వజ్రం బయటపడింది.పన్నా జిల్లా వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాలో గతంలో ధూళిలో విలువైన రత్నాన్ని వెలికితీసినప్పుడు చాలా మంది ధనవంతులు అయ్యారు. 13.47 క్యారెట్ల బరువున్న నాణ్యమైన వజ్రం బయటపడినపుడు రైతు  ములాయం సింగ్ తన కళ్లను నమ్మలేకపోయాడు. రైతు తన భాగస్వాములతో కలిసి పొలంలో తవ్వి మరో ఆరు చిన్న వజ్రాలను కనుగొన్నారు.


ముడి వజ్రం మార్కెట్ ధర దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని, అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వేలంలో వాస్తవ ధరను నిర్ణయిస్తామని డైమండ్ కార్యాలయానికి చెందిన అధికారి అనుపమ్ సింగ్ చెప్పారు.వేలం ద్వారా వజ్రాన్ని విక్రయించి వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించిన తర్వాత రైతుకు డబ్బు ఇవ్వనున్నారు.వజ్రం బయటపడటంతో రైతు ములాయం సింగ్ ఆనందానికి గురయ్యాడు. తనకు ఆరుగురు భాగస్వాములు ఉన్నారని, వజ్రాల వేలం వేస్తే వచ్చిన మొత్తాన్ని వారితో సమానంగా పంచుకుంటానని రైతు చెప్పారు. వజ్రం విక్రయిస్తే వచ్చే డబ్బును తన పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తానని సింగ్ చెప్పారు.


Updated Date - 2021-12-07T13:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising