ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడుతూ, పాడుతూ ఆ వృద్ధుడు కరోనాను ఎలా ఓడించాడంటే...

ABN, First Publish Date - 2021-04-27T15:32:53+05:30

దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. అన్ని వయసుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. అన్ని వయసుల వారినీ కరోనా తాకుతోంది. అయితే కరోనాను జయించినవారూ అత్యధికంగానే ఉంటున్నారు.  వయసు మీదపడిన వారు కూడా కరోనాను ధైర్యంగా జయిస్తూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన తులసీరామ్ సేఠియా(92) కరోనాను జయించారు. కరోనా సోకిన తులసీరామ్ హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. 


ఈ సమయంలో ఆయన తనకు ఎంతో ఇష్టమైన సంతీతం వింటూ, నృత్యం చేస్తూ కాలం గడిపారు. ఈ వయసులో తులసీరామ్‌కు కరోనా సోకగానే వారి ఇంటిలోనివారు ఆందోళన పడ్డారు. తులసీ రామ్ తాను ఆసుపత్రికి వెళ్లనని, ఇంటిలోనే చికిత్స తీసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అందుకు తగిన విధమైన ఏర్పాట్లు చేశారు. తులసీరామ్ ఆక్సిజన్ లెవెల్స్ తరచూ పరీక్షిస్తూ వచ్చారు. ఆయన తగిన విధంగా ఔషధాలు వాడటంతో కరోనాను జయించారు. కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చిన నేపధ్యంలో తులసీరామ్ మీడియాతో మాట్లాడుతూ తాను వందేళ్లు బతకాలనుకుంటున్నానని, తాను తనకు నచ్చిన ఆహారం తింటూనే కరోనాను ఓడించానని తెలిపారు.

Updated Date - 2021-04-27T15:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising