ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయంతో వణికిపోతున్న ఆ బాలునికి.. ఆయమ్మ ఒక రహస్యాన్ని చెప్పింది.. అదే అతను ‘జాతిపిత’గా మారేందుకు ఊపిరిపోసింది!

ABN, First Publish Date - 2021-12-18T14:19:04+05:30

మహాత్మా గాంధీ బాల్యానికి సంబంధించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహాత్మా గాంధీ బాల్యానికి సంబంధించిన ఉదంతం ఇది. ఉంది. మోహన్ దాస్ తన బాల్యంలో చిన్నచిన్న విషయాలకే చాలా భయపడేవారు. చీకటి పడినప్పుడు ఇంటిలోని ఒక గది నుంచి మరో గదిలోకి వెళ్లాల్సి వస్తే మోహన్‌దాస్ భయంతో వణికిపోయేవారు. ఒకరోజు చీకటి పడ్డాక మోహన్ దాస్ ఇంటిలోని ఒక గది నుండి బయటకు వెళ్ళవలసి వచ్చింది. కాలు బయట పెడుతున్నంతలో బయట దెయ్యం ఉన్నదనే ఆలోచన మెదిలింది. దీంతో మోహన్ దాస్‌లో భయం పుట్టుకొచ్చి, శరీరమంతా చెమటలు పట్టడం ప్రారంభించింది. 


దీంతో తాను బయటకు వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ సమయంలో తలుపు బయట ఒక ఆయా నిలబడి ఉంది. ఆమె పేరు రంభ. ఆమె మోహన్‌దాస్‌ను చూసి ‘ఏమైంది బాబూ?' అని అడింది. వెంటనే మోహన్ దాస్, 'ఆయమ్మా.. నాకు చాలా భయంగా ఉంది, నన్ను దెయ్యం పట్టుకుంటుందని అనిపిస్తోంది' అని అన్నాడు. వెంటనే ఆమె ‘నీకు భయం అనిపిస్తే, వెంటనే రాముని పేరు తలచుకో’ అని ధైర్యాన్నిచ్చింది రంభ. దీంతో మోహన్‌దాస్‌ రామనామం జపిస్తూ గదిలోంచి బయటకు అడుగుపెట్టి, ఏమాత్రం భయం లేకుండా వెళ్లిపోయాడు. ఈ పిల్లవాడు పెద్దయ్యాక దేశానికి విముక్తి కల్పించాడు. 'నా ఆత్మవిశ్వాసానికి రామనామం ఆధారం' అని గాంధీజీ తరచూ చెప్పేవారు. ఈ ఉదాహరణ ద్వారా మహాత్ముడు ఒక గొప్ప సందేశాన్ని అందించారు. పిల్లలను నిర్భయులుగా మార్చాలన్నా, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలన్నా వారిని భగవంతునితో అనుసంధానించాలన్నారు. దేవుడు అంటే మూఢనమ్మకం కాదని ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపమని తెలిపారు. దేవుని నామజపంలో అమోఘమైన శక్తి ఉంది. మంత్రం అందించే శక్తి మన శరీరంలో చేరినప్పుడు కొన్ని హార్మోన్లలో మార్పులు చోటు చేసుకుంటాయని, ఫలితంగా నిర్భయత్వం వస్తుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.

Updated Date - 2021-12-18T14:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising