ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 ఏళ్ల కూతురికి 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లికి ఏర్పాట్లు.. భర్త అడ్డు చెప్పడంతో ఆ భార్య చేసిన దారుణమిది!

ABN, First Publish Date - 2021-07-20T15:45:07+05:30

15 ఏళ్ల బాలిక 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది.. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 ఏళ్ల బాలిక 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది.. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. అందుకు ఆ బాలిక తల్లి కూడా అంగీకరించింది.. అయితే ఆ బాలిక తండ్రికి మాత్రం ఆ పెళ్లి ఇష్టం లేదు.. తన వయసున్న వ్యక్తిని తన కూతురు వివాహం చేసుకోవడానికి అతను అంగీకరించలేదు.. దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. మరుసటి రోజు భర్త శవమై తేలాడు.. బీహార్‌లోని బంధాపూర్‌లో ఈ ఘటన జరిగింది. 


బంధాపూర్‌కు చెందిన సంతోష్ శర్మ, అంజలీదేవి దంపతుల 15 ఏళ్ల కూతురు 45 ఏళ్ల కజిన్ రోషన్‌తో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకు ఆ బాలిక తల్లి అంజలీ దేవి కూడా అంగీకరించింది. అయితే కూతురు తన కంటే 30 ఏళ్లు పెద్దవాడైన రోషన్‌ను పెళ్లి చేసుకోవడానికి సంతోష్ అంగీకరించలేదు. దీంతో సంతోష్, అంజలి మధ్య ఈ వివాహం విషయమై వాగ్వాదం జరుగుతూ ఉండేది. గత నెల 25న వారిద్దరికీ రహస్యంగా వివాహం చేసేందుకు అంజలీ దేవి ప్రయత్నించింది. అయితే విషయం తెలుసుకున్న సంతోష్ ఆ పెళ్లిని ఆపేశాడు. 


ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు ఆ వివాహాన్ని వ్యతిరేకించడమే కాకుండా పంచాయితీ నిర్వహించి ఆ కుటుంబానికి 50 వేల రూపాయల జరిమానా విధించారు. దీంతో సంతోష్, అంజలి మధ్య గొడవలు మరింత పెరిగాయి. అనంతరం ఈ నెల 16 నుంచి సంతోష్ అదృశ్యమైపోయాడు. 18వ తేదీన ఆ గ్రామంలోని పొదల మధ్య అతని మృతదేహం లభించింది. దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. తన కొడుకును అతని భార్యే హత్య చేసిందని సంతోష్ తండ్రి ఆరోపిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్‌కు తరలించిన పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-20T15:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising