ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డాక్టర్.. మా అమ్మ అనారోగ్యంతో రొప్పుతోంది.. వెంటనే వచ్చి చూడండి’ అని ప్రాధేయపడిన ఆ యువకుడికి చేదు అనుభవం.. అదేంటో తెలిస్తే..

ABN, First Publish Date - 2021-11-24T15:13:43+05:30

మధ్యప్రదేశ్‌లోని గంజబాసౌదాకు చెందిన వైద్యుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధ్యప్రదేశ్‌లోని గంజబాసౌదాకు చెందిన వైద్యుడు ఒక యువకుడిని పరిగెత్తించిమరీ కర్రతో చావగొట్టాడు. ఆ యువకుడు తన తల్లికి చికిత్స చేయించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఇంతలో తల్లి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటాన్ని గమనించి, వెంటనే చికిత్స అందించాలని అక్కడున్న వైద్యుడిని కోరగా, ఆ వైద్యుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో ఉన్నతాధికారులు సదరు వైద్యునికి నోటీసు జారీచేశారు. 




ఈ సందర్భంగా బాధితుడు దీపక్ యాదవ్ మాట్లాడుతూ తన తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఆసుపత్రికి తీసుకువచ్చానన్నాడు. కొంతసేపటి వరకూ ఇక్కడ వైద్యులు అందుబాటులో లేరన్నాడు. ఇంతలో తల్లి ఆయాసంతో మరింతగా ఇబ్బంది పడిందన్నారు. దీంతో తాను గట్టిగా డాక్టర్ అని అరచి సహాయం కోరానన్నాడు.  వెంటనే అక్కడున్న డ్యూటీ డాక్టర్ వచ్చి, తమ మీద మండిపడ్డారన్నారు. తన తల్లిని చూడకుండానే.. వెంటనే విదిశ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లమని చెప్పారని, తాము కారణం అడగగా.. తనను పరిగెత్తించి మరీ కర్రతో కొట్టారని అన్నారు. కాగా దీనిపై బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దానిలో బాధితుడు డ్యూటీ డాక్టర్ సంకుల్ జైన్‌పై పలు ఆరోపణలు చేశాడు. ఆ వైద్యునిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.  ఈ విషయమై ఉన్నత వైద్యాధికారి డాక్టర్ అఖండ్ ప్రతాప్ మాట్లాడుతూ ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను పరిశీలించామని, సదరు వైద్యునిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2021-11-24T15:13:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising