ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది వయసున్న కూతురు నిద్రపోయింది కదా అని పక్కనే ఉన్న గుడికి వెళ్లిందా తల్లి.. తిరిగొచ్చేసరికి ఊహించని దారుణం..!

ABN, First Publish Date - 2021-10-12T13:19:04+05:30

‘నా కుమార్తెను అమ్మవారే కాపాడింది. వేడి పాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నా కుమార్తెను అమ్మవారే కాపాడింది. వేడి పాలు ఆమె మీద పడివుంటే అనర్థం జరిగేది..’ ఈ మాటలు  ఏడాది బాలిక తల్లి నోటి నుంచి వెలువడ్డాయి. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని ఆమె ఛతర్పూర్(మధ్యప్రదేశ్)లోని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. చికిత్స అందించిన వైద్యులు ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఆ చిన్నారి శరీరంపై కొన్ని చోట్ల వేడిపాలు పడ్డాయి. ఈ ఉదంతం జనక్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాహుల్, ప్రభా కుశావహ్‌ల ఏడాది కుమార్తె రష్మిపై వేడిపాలు పడటంతో గాయపడింది. వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని బర్న్స్ వార్డులో ఉంచారు. ఈ సందర్భంగా ప్రభ మాట్లాడుతూ.. తాను పాలు కాచిన తరువాత ఆ పాత్రను పైన గట్టుపై ఉంచానని, ఆ పక్కనే పాప నిద్రిస్తోందని తెలిపారు. 


పాప పడుకుంది కదా అని సమీపంలోని అమ్మవారి ఆలయానికి వెళ్లాను. అక్కడ పూజలు చేస్తుండగా, ఇంటిలో నుంచి పాప అరుపులు వినిపించాయి. పరుగుపరుగున ఇంటికివెళ్లి చూసేసరికి పాపపై వేడిపాలు పడటంతో గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ సమయంలో పాప చేతితో అమ్మవారి చిత్రపఠం ఉంది. వేడిపాలు అమ్మవారి చిత్రపఠంపై అధికశాతం ఒలికాయి. పాప కాలిపై కూడా కొద్దిమేరకు వేడి పాలు పడ్డాయి. ఈ సమయంలో అమ్మవారే పాపను కాపాడింది. లేకపోతే మరింత అనర్థం జరిగివుండేదని తెలిపారు. 

Updated Date - 2021-10-12T13:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising