ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊపిరి అందించి కోతిని కాపాడిన కారు డ్రైవర్‌

ABN, First Publish Date - 2021-12-14T15:58:13+05:30

రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో మనిషి పడి ఉంటే పట్టించుకోని నేటి రోజుల్లో ప్రాణాపాయంలో ఉన్న కోతిని రక్షించేందుకు కారు డ్రైవర్‌ చేసిన చర్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందుకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో మనిషి పడి ఉంటే పట్టించుకోని నేటి రోజుల్లో ప్రాణాపాయంలో ఉన్న కోతిని రక్షించేందుకు కారు డ్రైవర్‌ చేసిన చర్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పెరంబలూర్‌ జిల్లా కున్నం తాలూకా ఓదియం సమత్తువపురం ప్రాంతంలో ఈనెల 9వ తేదీ గుంపు నుంచి విడిపోయిన చిన్న కోతి తిరుగుతూ ఉంది. ఈ కోతిపై వీధి శునకాలు దాడిచేయడంతో శరీరంపై గాయాల య్యాయి. ఒకానొక సమయంలో కోతి స్పృహ తప్పి చెట్టు కొమ్మపైనే పడిపోయింది. ఈ కోతిని గమనించి అదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌ ప్రభు (38) చెట్టు కొమ్మ నుంచి కోతిని దించగా అది అచేతనంగా పడివుండడాన్ని గమనించాడు. దీంతో, కోతిని కాపాడే చర్యలు ప్రారంభించాడు. మనుషులకు అందించే ప్రాథమిక చికిత్సలాగే కోతి గుండెపై రెండు చేతులతో మర్ధన చేశాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వెంటనే కోతి నోట్లో తన నోరు పెట్టి గాలిని బలంగా ఊదసాగాడు. కొంతసేపటికీ కోతి కళ్లు తెరవడంతో వెంటనే దానిని తన మోటార్‌బైక్‌లో స్నేహితుడి సాయంతో పెరంబలూర్‌ ప్రభుత్వ వెటర్నీరీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కోతికి చికిత్సలు అందించిన వైద్యులు అటవీ శాఖకు అప్పగించారు. ప్రాణాపాయంలో ఉన్న కోతిని కాపాడడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రభు సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, ప్రభు చెట్టుపై నుంచి కోతిని దించడం, గుండెపై మర్ధన చేయడం, నోట్లో నోరు పెట్టి ఊదడం తదితర దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - 2021-12-14T15:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising