ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21 ఏళ్ల ఎంబీఏ యువతి.. బై అంటూ మెసేజ్ పెట్టి ఇంట్లోంచి అదృశ్యం.. 9 రోజుల తర్వాత సిటీలో ఆమె ఏం చేస్తోందో తెలిసి..

ABN, First Publish Date - 2021-12-27T20:36:34+05:30

ఆమె ఎంబీఏ విద్యార్థిని.. అక్కాబావతో కలిసి ఉంటూ చదువుకుంటోంది.. ఈ నెల 15న ఆమె అదృశ్యమైంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె ఎంబీఏ విద్యార్థిని.. అక్కాబావతో కలిసి ఉంటూ చదువుకుంటోంది.. ఈ నెల 15న ఆమె అదృశ్యమైంది.. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు.. ఆమె తన స్నేహితురాలికి పెట్టిన `బై` అనే మెసేజ్ ఆధారంగా ఆమె ఆచూకీ కనుగొన్నారు.. ఆమెను తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు.. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్‌లో ఈ ఘటన జరిగింది. 


గౌతమబుద్ధ నగర్‌లో ఎంబీఏ చదువుతున్న మాన్సీ బంగా అనే యువతి తన అక్కాబావతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. అక్కాబావ తనను నిశితంగా గమనిస్తున్నారని, తనను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆగ్రహం పెంచుకుంది. వారి చేష్టలతో విసుగు చెందిన ఆమె ఈ నెల 15న ఇంటి నుంచి అదృశ్యమైంది. గౌతమబుద్ధ నగర్ నుంచి రైలులో ఛండీగఢ్‌ వెళ్లి అక్కణ్నుంచి విమానంలో సూరత్ వెళ్లిపోయింది. సూరత్‌లో తన్న స్నేహితురాలి అన్న సహాయంతో ఓ సెలూన్‌లో జాబ్ సంపాదించింది. 


అక్కడి నుంచి తన స్నేహితురాలికి `బై` అని మెసేజ్ పంపింది. సీసీటీవీ కెమేరాల ద్వారా మాన్సీ జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు ఆ మెసేజ్ ఎంతగానో ఉపయోగపడింది. సూరత్ నుంచి ఆ మెసేజ్ వచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు నేరుగా అక్కడకు వెళ్లారు. ఆమె పనిచేస్తున్న సెలూన్‌కు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కణ్నుంచి ఆమెను ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Updated Date - 2021-12-27T20:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising