ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వద్దు.. నన్ను వెంబడించొద్దు.. లేదంటే తుపాకీతో కాలుస్తా.. అని అతను హెచ్చరించినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు.. ఆ తరువాత..

ABN, First Publish Date - 2021-12-01T17:40:06+05:30

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పరిధిలోని రూద్వాలా పోలీసులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పరిధిలోని రూద్వాలా పోలీసులకు చేదు అనుభవం ఎదురయ్యింది. వారు ఒక దుండగుడిని అదుపులోనికి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అతను పోలీసులపైకి కాల్పులు ప్రారంభించాడు. దీంతో పోలీసులు అతని బారినుంచి ఎలాగోలా తప్పించుకుని, ఎట్టకేలకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత అతని నుంచి రెండు తూటాలను, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం గురించి రూద్వాల పోలీస్‌స్టేషన్ హెడ్ మనీష్ శర్మ మాట్లాడుతూ.. రబ్బే అనే దుండగుడు బస్టాండ్ వద్ద దాగున్నాడని తమకు సమాచారం అందిందన్నారు. దీంతో తమ పోలీసుల బృందం అతనిని పట్టుకునేందుకు సంఘటనా స్థలానికి చేరుకుందన్నారు. 


అయితే పోలీసులను చూసిన ఆ దుండగుడు మోటార్ సైకిల్‌పై హనుమాన్ ఆలయం వైపుగా వేగంగా వెళ్లిపోయాడన్నారు. అయితే కొందరు పోలీసులు అతనిని వెంబడించి పట్టుకున్నారన్నారు. ఆ దుండగుడు వారిని విడిపించుకుని, పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోతూ తనను వెంబడిస్తే.. తుపాకీతో కాల్పులు జరుపుతానని హెచ్చరించాడు. అయినప్పటికీ పోలీసులు అతనిని వెంబడించారు. దీనిని గమనించిన ఆ దుండగుడు వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు నేల మీద పడుకొని, ప్రాణాలను కాపాడుకున్నారు. తరువాత అత్యంత చాకచక్యంగా ఆ దుండగుడిని పట్టుకున్నారు. అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పలు నేరారోపణలు ఎదుర్కొంటున్న రబ్బే కోసం పోలీసులు చాలాకాలంగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు రబ్బే పోలీసులకు చిక్కాడు.

Updated Date - 2021-12-01T17:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising