ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవిలో పాలు పంపిణీకి ఎమర్జెన్సీ ప్లాన్!

ABN, First Publish Date - 2021-03-08T17:03:44+05:30

వేసవి కాలంలో దేశవ్యాప్తంగా పాలకు కొరత ఏర్పడుతుంటుంది. ఈ సమయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వేసవి కాలంలో దేశవ్యాప్తంగా పాలకు కొరత ఏర్పడుతుంటుంది. ఈ సమయంలో పశువులు పాలు తక్కువగా ఇస్తుండటమే దీనికి ప్రధాన కారణం. వేసవిలో ఢిల్లీ-ఎన్సీఆర్‌లోని ప్రజలకు తగినంత రీతిలో పాలు సప్లయ్ కావు. ఇక్కడ పశుపోషణశాలలు తక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా ఇతర రాష్టాల నుంచి ఢిల్లీకి పాలు దిగుమతి అవుతుంటాయి. పాలు ఉత్పత్తి చేసే కంపెనీలు ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటాయి. 


యూపీలోని ఒక డెయిరీ ప్రతినిధి ఎండీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం వేసవితో పోల్చుకుంటే చలికాలంలో పాల దిగుబడి అధికంగా ఉంటుంది. పైగా చలికాలంలో పశుగ్రాసం ఎక్కువగా లభిస్తుంది. దీంతో పశువులు దానిని తిని అధికంగా పాలు ఇస్తాయి. అటువంటి సందర్భంలో పాలు పంపిణీ చేసిన తరువాత కూడా పాలు ఇంకా మిగులుతుంటాయి. ఈ మిగిలిన పాలను పౌడర్‌గా మారుస్తుంటారు. ఈ పౌడర్ 18 నెలల వరకూ వినియోగించేందుకు అనువుగా ఉంటుంది. పాలు సప్లయ్‌కి కొరత ఏర్పడకుండా పాల పౌడర్‌లో వెన్నను కలపి తిరిగి పాలను తయారు చేసి పంపిణీ చేస్తారు. 

Updated Date - 2021-03-08T17:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising