ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Breakups: ఆ బాధ పురుషులకే ఎక్కువ

ABN, First Publish Date - 2021-11-07T22:15:34+05:30

ఇంతే కాకుండా ప్రేమికుల మధ్య సాధారణంగా తలెత్తులున్న సమస్యలు ఏంటని, ప్రేమ బాంధవ్యాలు విడిపోవడానికి గల కారణాలను ఏంటనే కోణంలో కూడా విశ్లేషించారు. అయితే ఇందులో ఎక్కువ మంది ప్రేమ విఫలం కావడానికి గల కారణం తమ మధ్య ఉన్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెబ్ డెస్క్: ప్రేమ విఫలమైనప్పుడు దు:ఖపడని మది ఉండదు. అయితే అది వారి వారి మనస్తత్వాన్ని, ఆ ప్రేమలోని గాఢతను బట్టి ఉంటుంది. అయితే ఇలా ప్రేమ విఫలమైన వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా బాధ పడుతుంటారట. లాన్సెస్టర్ యూనివర్సిటీ తాజాగా చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అతి ఎక్కువగా 1,84,000 మంది భగ్న ప్రేమికుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.


ఇంతే కాకుండా ప్రేమికుల మధ్య సాధారణంగా తలెత్తులున్న సమస్యలు ఏంటని, ప్రేమ బాంధవ్యాలు విడిపోవడానికి గల కారణాలను ఏంటనే కోణంలో కూడా విశ్లేషించారు. అయితే ఇందులో ఎక్కువ మంది ప్రేమ విఫలం కావడానికి గల కారణం తమ మధ్య ఉన్న సమస్యలను ఒకరికొకరు చెప్పుకోకపోవడం. సర్వే చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరు ఇదే అభిప్రాయాన్ని చెప్పారట. ఇక దీని తర్వాత ప్రతి ఎనిమిదిలో ఒకరు నమ్మకం లేకపోవడం వల్ల విడిపోతున్నట్లు ప్రకటించారట.


ఇక ప్రేమ విఫలం అయినప్పుడు అందుకు గల కారణాలకు కాకుండా దానివల్ల కలిగిన ‘ఎమోషనల్ పెయిన్’ని ఎక్కువగా ఫీల్ అవుతున్నారట. ‘గుండె పగిలింది’ అంటూ ఏడవడం, బాధపడడం, పదే పదే గుర్తు చేసుకోవడం, స్నేహితులతో చెప్పుకోవడం లాంటివి చేస్తుంటారట. అయితే ఇలా ఎక్కువగా చేసేది మగవారేనట.

Updated Date - 2021-11-07T22:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising