ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళుతున్నారా? ఇక్కడ అలా కుదరదు.. కాదని తీసుకువెళ్లారంటే... ఏం జరుగుతుందంటే..

ABN, First Publish Date - 2021-10-19T13:32:27+05:30

శ్రీరామ భక్తుడైన హనుమంతునికి దేశంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరామ భక్తుడైన హనుమంతునికి దేశంలో లెక్కలేనన్ని ఆలయాలున్నాయి. హనుమంతుడు తమ కష్టాలు తీరుస్తాడని, కొండంత ధైర్యాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతుంటారు. అందుకే హనుమంతునికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. హనుమంతుని ఆలయాలలో ప్రసిద్ధమైనవాటిలో రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ మందిరం ఒకటి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఆలయం రాజస్థాన్‌లోని దౌసాలో రెండు కొండల మధ్య ఉంది. ఏడాది పొడవునా ఈ ఆలయంలో భక్తుల సందడి నెలకొంటుంది. 


ఈ ఆలయంలో భజరంగభళి.. బాల హనుమంతునిగా దర్శనమిస్తాడు. ఈ విగ్రహానికి ఎదురుగా సీతారాముల విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. ఈ ఆలయంలో హనుమంతుడిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఇక్కడికి చేరుకోవాడానికి వారం రోజుల ముందు నుంచి ఉల్లి, వెల్లుల్లి, నాన్ వెజ్ తినకూడదు. అలాగే మద్యం కూడా ముట్టకూడదు. ఈ ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుంటే భక్తులు కోర్కెలు నెరవేరుతాయని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని వారు తినకూడదు. అలాగని ఇంటికి కూడా తీసుకువెళ్లకూడదు. ఎవరికీ ఇవ్వకూడదు. ఆలయంలోనే ఆ ప్రసాదాన్ని తిరిగి సమర్పించాల్సివుంటుంది. అలాగే ఈ ఆలయం నుంచి కనీసం పూలను కూడా ఇంటికి తీసుకువెళ్లకూడదు. ఈ నిబంధనను కాదని భక్తులెవరైనా ప్రసాదాన్ని ఇంటికీ తీసుకువెళితే కష్టాల్లో పడతారని స్థానికులు చెబుతుంటారు. 


Updated Date - 2021-10-19T13:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising