ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి ఇతనే..!

ABN, First Publish Date - 2021-01-19T19:15:02+05:30

ఆరోగ్యకరమైన అలవాట్లలో స్నానం ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేయడం వల్ల ఆ రోజంతా ఏంతో హాయిగా ఉంటది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

65 ఏళ్లుగా నో స్నానం

టెహ్రాన్‌‌: ఆరోగ్యకరమైన అలవాట్లలో స్నానం ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేయడం వల్ల ఆ రోజంతా ఏంతో హాయిగా ఉంటది. ఇక రెండు రోజులు స్నానం చేయకపోతే గబ్బుకొట్టి మనతో పాటు మన పక్కన ఉండేవారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఇరాన్‌కు చెందిన ఓ తాత గత ఆరున్నర దశాబ్దాలుగా స్నానం చేయలేదట. సుమారు 65 ఏళ్లుగా ఒంటిపై చుక్కనీరు కూడా వేసుకోలేదు. దీంతో అతను ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా రికార్డుకెక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ(83) అనే వ్యక్తి దెజ్‌ అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను స్నానం చేయక దాదాపు 65 ఏళ్లు దాటిందట. ఇలా ఆరున్నర దశాబ్దాలుగా ఒంటిపై చుక్కునీరు పోసుకుని అతని పరిస్థితి ఏంటని ఊహించుకుంటేనే అదోలా ఉంది కదు. అయినా అతను పూర్తి ఆరోగ్యంగా ఉండడం గమనార్హం. 


ఇప్పటివరకు తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని హాజీ చెప్పాడు. అయితే, హాజీ  ఇలా స్నానం చేయకపోవడానికి ఓ బలమైన కారణమే ఉంది. ఇరవై ఏళ్ల వయసున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాడట. దీంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్లే అనారోగ్యానికి గురయ్యానని భావించిన అతడు.. అప్పటినుంచి స్నానం చేయడం మానేశాడు. అలా 65 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటివరకు కూడా స్నానం జోలికి పోలేదట. ఇక మాంసాహారం ఎంతో ఇష్టంగా తినే హాజీకి కుళ్లిపోయిన కుళ్లిన పంది మాంసం అంటే ఎంతో ఇష్టమట. రోజుకు అయిదు లీటర్ల నీటిని మాత్రం తాగుతుంటానని హాజీ తెలిపాడు. ఊరి బయట ఓ చిన్న గుడిసెలో నివసించే హాజీకి గ్రామస్తులే భోజనం పెడుతుంటారు. కానీ, ఇంట్లో వండిన వంటకాలను అతను అంతగా ఇష్టపడట. 


అంతేకాకుండా ఇలా మురికిగా ఉంటూనే ఇంకా చాలా ఏళ్లు బతికి చూపిస్తానని చెబుతున్నాడీ పెద్దాయన. అలాగే తనకు ధూమాపానం అంటే చాలా ఇష్టమని చెప్పాడు. తాను చైన్ స్మోకర్ అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ బీడీ, సిగరెట్‌ లాంటివి అందుబాటులో లేకపోతే జంతువుల వ్యర్థాలనే చుట్టలా చుట్టి కాల్చుకొని పీల్చుతుంటానని తెలిపాడు. హాజీకి ఊరి వాళ్లు చాలాసార్లు స్నానం చేసుకోవాలని సూచించిన అతను ససేమీరా అన్నాడట. ఆరు దశాబ్దాలుగా పైగా స్నానం చేయకపోయినా తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాడని గ్రామస్తులు చెప్పారు. 



Updated Date - 2021-01-19T19:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising