ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనికి వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయలుదేరిన యువకుడు.. మరుసటి రోజు చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2021-11-24T12:27:54+05:30

ఇంటి నుంచి పని కోసం వెళుతున్నానంటూ బయలుదేరిన ఓ యువకుడు రాత్రైనా ఇంటికి రాలేదు. తరువాతి రోజు పోలీసులు అతని శవం దొరికిందని కుటుంబ సభ్యులకు తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి నుంచి పని కోసం వెళుతున్నానంటూ బయలుదేరిన ఓ యువకుడు రాత్రైనా ఇంటికి రాలేదు. తరువాతి రోజు పోలీసులు అతని శవం దొరికిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగర సమీపంలో ఉన్న బజడా గ్రామంలో జరిగింది.


బజడా గ్రామంలో నివసించే బిమలేశ్ కుమార్(20) తండ్రి శంషేర్ సింగ్ ఇటీవల చనిపోయాడు. అప్పటి నుంచి బిమలేశ్ ఎవరితోనూ సరిగా మాట్లాడేవాడు కాదు. బిమలేశ్ తన ఇద్దరు అన్నదమ్ములతో ఒక అద్దె ఇంట్లో ఉండేవాడు. అతను పెయింటింగ్ పని చేసేవాడు. గత బుధవారం (నవంబర్ 17న) లుధియానాలో పని దొరికిందని చెప్పి బయలుదేరిన అతడు రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. ఆ రోజు ఛట్ మహాపర్వం అనే పండుగ ఉండడంతో లుధియానాలోనే ఆ రాత్రికి తన మిత్రుల వద్ద ఉన్నాడనుకున్నారు.


కానీ బుధవారం రాత్రి బజడా గ్రామస్తులు కొందరు లుధియానా నుంచి వస్తుండగా ఊరి చివర ఒక చెట్టుకి బిమలేశ్ కుమార్ శవం వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులకి సమాచారం అందించారు. రాత్రి సమయం కావడంతో పోలీసులు మరుసటి రోజు (గురువారం) ఉదయం బిమలేశ్ కుమార్ గురించి విచారణ చేపట్టారు. అతని కుటుంబం గురించి తెలుసుకొని వారికి కబురు పంపారు. 


బిమలేశ్ కుమార్ సోదరులిద్దరూ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సహకరించారు. బిమలేవ్ గత కొంత కాలంగా ఎవరితో మాట్లాడేవాడు కాదని, అతనికే సమస్య వచ్చిందో తమతో చెప్పలేదని వారు పోలీసులతో అన్నారు. ప్రస్తుతం పోలీసులు బిమలేశ్ మరణం ఆత్మహత్య చేసుకోవడం వల్ల జరిగిందని భావిస్తున్నారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి, ఆత్మహత్య కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-11-24T12:27:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising