ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీపీఈ కిట్ ధరించి భారీగా బంగారం దోచుకెళ్లిన ఘరానా దొంగ!

ABN, First Publish Date - 2021-01-22T00:39:17+05:30

దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పీపీఈ కిట్ ధరించిన దొంగ కల్కాజీ ప్రాంతంలోని ఓ బంగారం షాపు నుంచి కోట్లాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పీపీఈ కిట్ ధరించిన దొంగ కల్కాజీ ప్రాంతంలోని ఓ బంగారం షాపు నుంచి కోట్లాది రూపాయల విలువైన నగలను దోచుకెళ్లాడు. మంగళవారం రాత్రి 9.40 నుంచి 3.50 మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. షాపులో ఏర్పాటుచేసిన సీసీకెమేరాలో ఈ దోపిడీ మొత్తం రికార్డు అయ్యింది. అయితే దొంగ తన గుర్తింపు వివరాలు తెలియకుండా పీపీఈ కిట్ ధరించాడు. మరుసటి రోజు ఉదయాన్నే షాపు తెరిచి చూసిన యజమాని చోరీ జరిగినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సీసీకెమేరా ఫూటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దొంగ ఆ షాపు పైకప్పు పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్టు చెబుతున్నారు. ‘‘అంజలి జ్యువెలర్స్‌లో చోరీ జరిగింది. సీసీటీవీలో ఓ వ్యక్తి రెండు బ్యాగ్‌లను మోసుకెళ్తూ కనిపిస్తున్నాడు. కానీ ఎంతమంది ఈ చోరీలో పాల్గొన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఎంత సొమ్ము పోయిందన్న విషయం కూడా యజమాని ఇంకా వెల్లడించలేదు...’’ అని సౌత్‌ఈస్ట్ ఢిల్లీ డీసీపీ ఆర్‌పీ మీనా వెల్లడించారు. వేలిముద్రలను సేకరించేందుకు జిల్లా క్రైం ఫోరెన్సిక్ టీమ్‌ను పిలిపించామనీ.. డేటా మొత్తం విశ్లేషించేందుకు పలు టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 


Updated Date - 2021-01-22T00:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising