ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి దేహంలో ఆరు అడుగుల ఇనుప చువ్వ.. ఆరుగురు డాక్టర్ల స్పెషల్ ఆపరేషన్.. చివరకు..

ABN, First Publish Date - 2021-08-16T13:56:03+05:30

ఆటోట్రాలీ ప్యాసింజర్ సీటులో కూర్చొని ప్రయాణిస్తున్నాడా యువకుడు. అలా వెళ్తుండగా సడెన్‌గా ఆ వాహనం టైరు పగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఆటోట్రాలీ ప్యాసింజర్ సీటులో కూర్చొని ప్రయాణిస్తున్నాడా యువకుడు. అలా వెళ్తుండగా సడెన్‌గా ఆ వాహనం టైరు పగిలింది. దీంతో వాహనం పక్కకు ఒరిగింది. ఈ సమయంలో రోడ్డుపై పాతి ఉన్న ఒక ఐరన్ యాంగిల్ (ఇనుప చువ్వ).. అతని ఛాతీలో దిగబడింది. ఆరు అడుగుల పొడవున్న ఈ చువ్వ.. అతని శరీరంలో నుంచి దూసుకుపోయింది. తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతున్న అతన్ని.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పంజాబ్‌లోని బఠిండాలో జరిగింది. లహరా గ్రామానికి చెందిన ఒక యువకుడు.. ఆటో ట్రాలీలో వెళ్తుండగా ఈ దారుణం జరిగింది.


ఆస్పత్రికి చేరుకున్న ఆ యువకుడికి ఆరుగురు డాక్టర్లు, 15 మంది పారామెడికల్ సిబ్బంది కలిసి ఆపరేషన్ చేసి.. అతని శరీరంలో దిగబడిన ఇనుప చువ్వను తొలగించారు. ఈ ఆపరేషన్ చేయడానికి 5 గంటలు పట్టిందట. ఆస్పత్రికి వచ్చినప్పుడు ఆ యువకుడు మాట్లాడుతూనే ఉన్నాడని, డాక్టర్లు తన శరీరంలోని ఇనుప చువ్వను తొలగిస్తే చాలని, మిగతాది ఆ భగవంతుడే చూసుకుంటాడని చెప్పాడట. ఈ విషయాన్ని ఆపరేషన్ చేసిన వైద్యులు వెల్లడించారు. ఇనుప చువ్వ ఏ మాత్రం కొంచెం పక్కన గుచ్చుకొని, హృదయాన్ని తాకి ఉన్నా.. సదరు యువకుడు మృతిచెంది ఉండేవాడని వైద్యులు చెప్తున్నారు.

Updated Date - 2021-08-16T13:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising