ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్ల్ ఫ్రెండ్‌ కోసం ఒంటెను దొంగిలించాడు.. కానీ చివరకు..

ABN, First Publish Date - 2021-02-18T19:34:50+05:30

ప్రేయసికి ప్రియుడు బహుమతులివ్వడం మనకు తెలుసు. కానీ ఆ బహుమతి ఎంత విలువైనదైతే అతడి ప్రేమ అంత గొప్పదని భావిస్తుంటారు. అయితే తన ప్రేమ గొప్పతనాన్ని ఇంకా గొప్పగా చాటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రేయసికి ప్రియుడు బహుమతులివ్వడం మనకు తెలుసు. కానీ ఆ బహుమతి ఎంత విలువైనదైతే అతడి ప్రేమ అంత గొప్పదని భావిస్తుంటారు. అయితే తన ప్రేమ గొప్పతనాన్ని ఇంకా గొప్పగా చాటి చెప్పాలనుకున్నాడు ఓ అరబ్ యువకుడు. అయితే ఏ బంగారు గొలుసో, వజ్రాల ఉంగరమో ఇచ్చి ఇంప్రెస్ చేయకుండా ఏకంగా ఓ ఒంటెని గిఫ్ట్ ఇచ్చాడు. అరబ్ దేశం కదా.. అందుకే అతడికి ఒంటె పెద్ద బహుమతిగా అనిపించింది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఒంటెను అతడు కొనలేదు. దొంగిలించాడు. ఇక్కడే చిక్కంతా వచ్చి పడింది. అతడితో పాటు అతడి ప్రేయసి కూడా ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.


ఓ వ్యక్తి తన ఒంటె పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో పోలీసులకు మరో ఫోన్ వచ్చింది. తన ఫాం హౌస్‌లో ఓ గుర్తు తెలియని ఒంటె వచ్చిందని. పోలీసులు అక్కడకు వెళ్లి ఆ ఒంటెను గుర్తించి యజమానికి అప్పగించారు. ఫాంహౌస్ యజమానిని పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నించేసరికి అసలు విషయం బయటకొచ్చింది.


తానే ఆ ఒంటెను దొంగిలించానని, తన ప్రేయసికి బహుమతిగా ఇచ్చేందుకే దానిని దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడితో పాటు అతడి ప్రేయసిని కూడా అరెస్టు చేశారు. ఒంటెను ఇచ్చి ఇంప్రెస్ చేద్దామనుకున్న అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. ఇప్పుడు అతడితో పాటు ఆమె కూడా జైల్లో పడింది. మరి విడుదలైన తరువాత అతడికి బ్రేకప్ చెబితే పరిస్థితేంటో..!

Updated Date - 2021-02-18T19:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising