ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్వీట్లు కొనుక్కోవడానికి వెళ్తున్నా’.. అనే సైన్‌తో లాక్‌డౌన్‌లో బయటకు.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2021-05-18T04:11:32+05:30

కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించడం కోసం దేశంలోని చాలా దేశాలు మరోసారి లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కరోనా సెకండ్ వేవ్‌ను నియంత్రించడం కోసం దేశంలోని చాలా దేశాలు మరోసారి లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో కూడా కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వం తెలిపింది. పోలీసులు కూడా నిత్యం పహారా కాస్తూ ప్రజలెవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఒక అట్టముక్కపై ‘మిష్టి కింటె జాచి’ (స్వీట్లు కొనుక్కోవడానికి వెళ్తున్నా) అని రాసి, దాన్ని మెడలో వేసుకొని రోడ్డుపైకి వచ్చాడు. అతన్ని ఆపిన పోలీసులకు మెడలోని కార్డు చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ట్విట్టర్లో ఒక వ్యక్తి స్పందిస్తూ.. ‘‘బెంగాలీలకు మిష్టి(స్వీట్స్) లేకుండా రోజు గడవడం చాలా కష్టం’ అంటూ కామెంట్ చేశారు.

Updated Date - 2021-05-18T04:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising