ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యను మరొకరికిచ్చి పెళ్లి చేసి.. 10 లక్షలివ్వాలని బ్లాక్‌మెయిల్.. చివరికి కథ ఎలా అడ్డం తిరిగిందంటే..

ABN, First Publish Date - 2021-10-08T12:40:43+05:30

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కేడి దంపతులకు రాజస్థాన్ పోలీసులు చెక్‌పెట్టారు. భార్యభర్తలిద్దరూ కలిసి అమాయక కుటుంబాలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు సంపాదించేవారు. వారి కథ ఎలా ముగిసిందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కేడి దంపతులకు రాజస్థాన్ పోలీసులు చెక్‌పెట్టారు. భార్యభర్తలిద్దరూ కలిసి అమాయక కుటుంబాలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు సంపాదించేవారు. వారి కథ ఎలా ముగిసిందంటే..


రాజస్థాన్‌కు చెందిన రోహిత్ కుమార్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనిల్ కుమార్ గుప్తా(35) పరిచయమయ్యాడు. అనిల్ కుమార్ చెల్లెలు బిందు చాలా అందగత్తె. ఆమెను రోహిత్‌ పెళ్లిచేసుకున్నాడు. అలా బిందును రోహిత్‌కిచ్చి పెళ్లి చేసేందుకు అనిల్ కొంత డబ్బు తీసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత రోహిత్‌తో బిందు గొడవ పడి అనిల్ వద్దకు వెళ్లిపోయింది. 


ఒకరోజు రోహిత్ తన భార్యను నచ్చజెప్పి తీసుకురావడానికి అనిల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ అనిల్, బిందు ఏకాంతంగా గదిలో శృంగారం చేసుకుంటున్నారు. అది చూసిన రోహిత్‌కు దిమ్మతిరిగింది. వారిద్దరూ అన్నా చెల్లెలు కాదు.. భార్యాభర్తలని తెలిసి రోహిత్ షాక్ నుంచి తేరుకోలేక పోయాడు.  రోహిత్ షాక్ నుంచి తేరుకొని కోపంతో వారిద్దరినీ ఎదిరించాడు. ఇంత మోసమా.. అని గట్టిగా అడిగాడు. అప్పుడు రోహిత్‌ను అనిల్ మరోరకంగా బెదిరించాడు. 


రోహిత్, అతని కుటుంబ సభ్యులు(రోహిత్ తమ్ముడు) బిందుపై సామూహిక అత్యాచారం చేసినట్టు వారిపై కేసు పెడతానని అనిల్ బెదిరించాడు. అలా జరగకూడదంటే 10 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రోహిత్ పడ్డాడు. తరువాత తనను మోసం చేసిన అనిల్, బిందులను వదలకూడదని నిర్ణయించుకొని పోలీసులను ఆశ్రయించాడు. వారికి జరిగినదంతా వివరించాడు. అప్పుడు పోలీసులు అనిల్, బిందుని పట్టుకోవడానికి ప్లాన్ వేశారు. 


అనిల్ అడిగినట్టు రోహిత్ సూట్‌కేసులో 10 లక్షలు డబ్బు తీసుకొని ఒక లాడ్జికి వెళ్లాడు. అక్కడ అనిల్ సూట్ కేస్ తెరిచి డబ్బుల కట్టలు చూస్తుండగా.. అవి నకిలీవని తేలింది. ఇదేంటని అనిల్ రోహిత్‌ని ప్రశ్నించేలోపే పోలీసులు రంగప్రేవేశం చేసి పట్టుకున్నారు. అనిల్, బిందుని అరెస్టు చేసి వారి గురించి ఆరా తీశారు. వారిద్దరూ రోహిత్‌ని మోసం చేసినట్టు చాలా మందిని హనీట్రాప్ చేసి మోసం చేశారని విచారణలో తెలిసింది. ఇప్పుడా కేడి దంపతులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Updated Date - 2021-10-08T12:40:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising