ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల వయసులో కిడ్నాప్ అయిన పిల్లాడు.. 24 ఏళ్లుగా వెతుకుతున్న తండ్రి.. ఆ కథ ఎలా ముగిసిందంటే

ABN, First Publish Date - 2021-07-23T02:25:32+05:30

ఒక రెండేళ్ల పిల్లాడిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. పిల్లాడి నోరు నొక్కి తల్లిదండ్రులకు కనిపించకుండా ఎత్తుకుపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బండికి రెండు వైపులా రెండు జెండాలు. బండి వెనుక బ్యాగు నిండా పాంప్లెట్లు. ఇవే ఆయన ఆయుధాలు. సుమారు పాతికేళ్లుగా వీటితోనే సహజీవనం చేస్తున్న ఆయన్ను ఎవరైనా కదిలిస్తే.. మనసుల్ని కదిలించే కథ బయటపడుతుంది. ఆయన కథ మనుషుల్ని ఎంతలా ఆశ్చర్యపరిచిందంటే.. ఆ కథతో ఒక సినిమానే తీసేంతలా. అసలు ఆయనెవరు? ఏంటా కథ?


రెండేళ్ల పిల్లాడిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. పిల్లాడి నోరు నొక్కి తల్లిదండ్రులకు కనిపించకుండా ఎత్తుకుపోయారు. ఇలా తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. ఎలాగైనా తన బిడ్డను మళ్లీ కలుసుకోవాలని ఆ తండ్రి గాలింపు ప్రారంభించాడు. ఈ ఘటన జరిగి ఇప్పటికి 24 ఏళ్లు. అయినా సరే తన బిడ్డ కోసం ఆ తండ్రి గాలింపు ఆపలేదు. మోటార్ బైకుపై తన బిడ్డ బొమ్మతో చేసిన జెండా తగిలించుకొని 5లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. చైనా మొత్తం తిరిగేశాడు. అంటే ఈ ఘటన అక్కడే జరిగిందిలెండి. ఈ తండ్రి ప్రేమ ఎంతలా వైరల్ అయ్యిందంటే.. ఆయన కథపై 2015లో ‘లాస్ట్ అండ్ లవ్’ అనే సినిమా కూడా వచ్చింది.


బిడ్డను వెదకడం కోసం ఆయన చేసిన ఖర్చు.. ఆ తండ్రికి అప్పులే మిగిల్చింది. అయినా సరే బిడ్డకోసం గాలింపు మాత్రం ఆయన ఆపలేదు. ఆ తండ్రి పేరు గువో గ్యాంగ్‌టాంగ్. చైనాలోని షాండాంగ్ అనే గ్రామంలో 1997లో గ్యాంగ్‌టాంగ్ రెండేళ్ల బిడ్డ గువో షింజెన్ కిడ్నాప్ అయ్యాడు. అప్పటి నుంచి గ్యాంగ్‌టాంగ్.. తన బిడ్డ కోసం వెతుకుతూనే ఉన్నాడు. తాజాగా చైనా ప్రభుత్వం పిల్లల కిడ్నాప్‌లకు సంబంధించి క్లోజ్ కాని కేసుల దర్యాప్తును మరోసారి ప్రారంభించింది. ఈ క్రమంలోనే షింజెన్ పోలికలు ఉన్న ఒక వ్యక్తిని హేనాన్ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. టీచర్‌గా పనిచేస్తున్న అతనికి డీఎన్ఏ టెస్టులు చేయగా అతనే షింజెన్ అని తెలిసింది. దీంతో ఎట్టకేలకు ఆ తండ్రీకొడుకులు కలిశారు. ‘‘నా బిడ్డ నాకు దొరికాడు. ఇప్పుడు మళ్లీ సాధారణ జీవితం గడపాలనుకుంటున్నా’’ అంటూ గ్యాంగ్‌ట్యాంగ్ కన్నీటి పర్యంతం అయ్యాడు.

Updated Date - 2021-07-23T02:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising