ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక మంచి మహిళ కావలెను.. అంటూ రద్దీ రోడ్డు పక్కనే హోర్డింగ్ పెట్టి మరీ 66 ఏళ్ల వ్యక్తి వింత ప్రకటన..!

ABN, First Publish Date - 2021-12-22T07:17:50+05:30

ఇటీవలే భార్య చనిపోయిన ఒక 66 ఏళ్ల వ్యక్తి జీవితంలో ఒంటరిగా ఉండలేక తనకు మరొక మహిళ తోడు అవసరం అంటూ రోడ్డు పక్కనే హోర్డింగ్ పెట్టాడు. అతని పేరు జిమ్ బేస్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలే భార్య చనిపోయిన ఒక 66 ఏళ్ల వ్యక్తి జీవితంలో ఒంటరిగా ఉండలేక తనకు మరొక మహిళ తోడు అవసరం అంటూ రోడ్డు పక్కనే హోర్డింగ్ పెట్టాడు. అతని పేరు జిమ్ బేస్. 


66 ఏళ్ల జిమ్ ఇంతకు ముందు కూడా రెండు సార్లు పెళ్లిచేసుకున్నాడు. అతని మొదటి భార్య చనిపోగా.. రెండో భార్యను విడాకులిచ్చాడు. మొదటి భార్య చనిపోయేంత వరకు తననే ప్రేమించానని, రెండో భార్యతో అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయానని జిమ్ చెప్పాడు.




జిమ్‌కు అయిదుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక మంచి బిజినెస్‌మేన్. అతనికి ముందు వాషింగ్టన్‌లో బిజినెస్ ఉండేది. దానిని ఇటీవలే టెక్సాస్‌కు మార్చుకున్నాడు. జిమ్ బేస్‌కు తనకు మొబైల్ లేదా ఆన్‌లైన్ డేటింగ్ చేయడమంటే ఇష్టం లేదని.. ఇలా రోడ్డుపై హోర్డింగ్ పెట్టడమే బాగుందని జిమ్ తెలిపాడు. ఇప్పటికే 4-5 మహిళలతో డేటింగ్‌కు వెళ్లానని, కానీ వారెవరూ అంతగా తనకు నచ్చలేదని ఆయన చెప్పాడు.


తను 50-55 ఏళ్ల మధ్య వయసుగల ఒక మంచి మహిళ కోసం ఎదురుచూస్తున్నానని.. అమెతో ఈ క్రిస్‌మస్ సరదాగా జరుపుకోవాలనుందని జిమ్ అన్నాడు. 

Updated Date - 2021-12-22T07:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising