ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైన్‌షాపులో టిక్ టాక్ వీడియో షూటింగ్.. ఒక్క పొరపాటుతో ప్రాణాలు గాల్లోకి..

ABN, First Publish Date - 2021-12-24T06:17:22+05:30

సరదాగా టిక్ టాక్ వీడియో చేయబోయి ఒక యువకుడు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక వైన్ షాపు వద్ద ఒక యువకుడు తుపాకీ పట్టుకొని టిక్ టాక్ వీడియో చేస్తున్న సమయంలో పొరపాటున ఆ తుపాకీ పేలడంతో ఎదరుగా ఉన్న వ్యక్తి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరదాగా టిక్ టాక్ వీడియో చేయబోయి ఒక యువకుడు తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక వైన్ షాపు వద్ద ఒక యువకుడు తుపాకీ పట్టుకొని టిక్ టాక్ వీడియో చేస్తున్న సమయంలో పొరపాటున ఆ తుపాకీ పేలడంతో ఎదరుగా ఉన్న వ్యక్తి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇందోర్ నగరంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరంలో పరదేశి పురా ప్రాంతంలో ఉన్న  ఒక వైన్ షాపులో మనీష్, సుశీల్ అనే ఇద్దరు యువకులు పనిచేస్తున్నారు. వారిద్దరూ కలిసి ఒక టిక్ టాక్ వీడియో చేయాలనుకున్నారు. ఆ వీడియోలో తుపాకీ అవసరం ఉండడంతో తెలిసిన ఒక సెక్యూరిటీ గార్డు మిత్రుడి నుంచి తుపాకీ తీసుకున్నారు. ఆ తరువాత వైన్ షాపు వద్ద ఉదయాన్నే వీడియో తీయడం ప్రారంభించారు. కానీ తుపాకీ లోడెడ్ ఉందని వారు గమనించలేదు. దీంతో వీడియో చేయడంలో భాగంగా మనీష్ దాని ట్రిగర్ నొక్కాడు.. అంతే ఎదురుగా ఉన్న సుశీల్‌కు బుల్లెట్ తగిలి ఒక్కసారిగా కుప్పకూలాడు.


ఇది చూసి కంగారు పడిన మనీష్.. సుశీల్‌ను లేపడానికి ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సుశీల్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. పోలీసులు మనీష్‌ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. దర్యాప్తు కోసం పోలీసులు ప్రస్తుతం వైన్ షాపుని సీజ్ చేశారు.

Updated Date - 2021-12-24T06:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising