ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది రోజులుగా కనపడని వ్యక్తి.. ఇంట్లోనే శవం దాచిన భార్య.. ఇదంతా ఎందుకు చేసిందంటే..

ABN, First Publish Date - 2021-12-29T10:42:16+05:30

తన సోదరుడు పది రోజులుగా కనపడడం లేదని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని ఇంటకి వెళ్లి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో తాళం పగలకొట్టి చూస్తే అక్కడ ఆ వ్యక్తి శవం కనపడింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన సోదరుడు పది రోజులుగా కనపడడం లేదని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని ఇంటకి వెళ్లి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో తాళం పగలకొట్టి చూస్తే అక్కడ ఆ వ్యక్తి శవం కనపడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్‌పూర్ గ్రామానికి చెందిన కమలేష్(40) అనే వ్యక్తి కనబడడం లేదంటూ అతని సోదరుడు రాంకిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కమలేష్ ఇంటికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. కమలేష్ భార్య సునీత, కుమారుడు ఆదర్ష్ ఎక్కడికెళ్లారో ఎవరికీ తెలియదు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు తాళం  పగలకొట్టి లోపలికి వెళ్లి చూశారు. అక్కడ కమలేష్ శవం దొరికింది. 


కమలేష్‌ను అతని భార్య సునీత హత్య ఉంటుందని, కమలేష్ సోదరుడు రాంకిషన్ పోలీసులకు చెప్పాడు. సునీత ఫోన్ నెంబర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆమె పట్టుకున్నారు. సునీతను పోలీసులు విచారణ పేరుతో చిత్రహింసలు పెడతారన్న భయంతో ఆమె కుమారుడు ఆదర్ష్ పోలీసులకు నిజం చెప్పాడు. తన తండ్రి కమలేష్‌ తాగబోతు అని.. రోజూ ఇంటికి తాగి వచ్చి తనని, తన తల్లిని చితకబాదేవాడని ఆదర్ష్ చెప్పాడు. ఒకరోజు తల్లీకొడుకులు కలిసి కమలేష్‌ని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. హత్య చేశాక శవాన్ని ఏం చేయాలో తోచక ఇంట్లోనే పెట్టి.. తాము పారిపోయామని ఆదర్ష్ తెలిపాడు. 


పోలీసులు సునీత, ఆమె కుమారుడు ఆదర్ష్ పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Updated Date - 2021-12-29T10:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising