ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుడు పక్కనుండగానే.. వధువు డ్రస్సులోంచి హఠాత్తుగా బయటికొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో

ABN, First Publish Date - 2021-06-17T19:17:15+05:30

జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్లి వేడుక అంటే ఈ తరం యువతీయువకులకు ఎన్నో కలలు ఉంటాయి. అంగరంగ వైభవంగా జరగాలని ముచ్చటపడుతుంటారు. అదిరేటి డ్రస్సులు వేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్లి వేడుక అంటే ఈ తరం యువతీయువకులకు ఎన్నో కలలు ఉంటాయి. అంగరంగ వైభవంగా జరగాలని ముచ్చటపడుతుంటారు. అదిరేటి డ్రస్సులు వేస్తారు. ఇక వధువుల అలంకరణను వర్ణించడానికయితే మాటలు చాలవు. అయితే ఒక్కోసారి పెళ్లి వేడుకల్లో ధరించే వస్త్రాలే చిక్కుల్ని తెచ్చి పెడతాయి. నడవడానికి కూడా వధువులు ఇబ్బందులు పడుతుంటారు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అచ్చం ఇలాగే జరిగింది. రోయెల్ లూనెసా అనే ఓ వ్యక్తి వెడ్డింగ్ ప్లానర్‌గా ఓ కంపెనీని నడుపుతున్నాడు. జూన్ ఆరో తారీఖున పినముంగజన్‌లోని లోయీ బీచ్ రిసార్ట్‌లో ఓ పెళ్లి వేడుకను నిర్వహించాడు. ఈ వేడుకలోనే అతడు ఓ వింత నిర్వాకానికి పాల్పడ్డాడు. 


పెళ్లి వేడుకలో ఏర్పాటు చేసిన ఫ్యాన్ల ద్వారా బలమైన గాలి వీచి డ్రస్ ఎగిరిపోతూ వధువు ఇబ్బందులు పడుతుందని అతడు గ్రహించాడు. దీంతో అతడు ఆమె డ్రస్ కింద దాక్కుని ఆమె నడిచేందుకు వీలుగా ఉంటూ, ఆమె డ్రస్ ఎగిరిపోకుండా పట్టుకున్నాడు. వధువును వరుడు పెళ్లి వేదిక వరకు తీసుకుని పోయే దాకా అతడు అలాగే ఉన్నాడు. పెళ్లి వేదిక దగ్గరకు రాగానే అతడు ఆమె డ్రస్ లోంచి హఠాత్తుగా బయటకు వచ్చాడు. బంధువుల్లో కలిసిపోయాడు. అయితే ఇతడి నిర్వాకాన్ని అక్కడ ఉన్న బంధువులు ఎవరూ పట్టించుకోనట్టుగా ఉండిపోవడం గమనార్హం. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి. 



Updated Date - 2021-06-17T19:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising