ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15 నెలలుగా చాతిలోనే కత్తి.. అయినా అతనికి ఆ విషయమే తెలియదు!

ABN, First Publish Date - 2021-03-28T01:14:27+05:30

ఓ వ్యక్తి దాదాపు 15 నెలలుగా సుమారు 5అంగుళాల పొడవున్న కత్తిముక్కను చాతిలో పెట్టుకుని తిరిగిస్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆ కత్తి తన శరిరీంలో ఉన్న సంగతి కూడా అతనికి తెలియదు. తాజాగా ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి దాదాపు 15 నెలలుగా సుమారు 5అంగుళాల పొడవున్న కత్తిముక్కను చాతిలో పెట్టుకుని తిరిగిస్తున్నాడు. ఇక్కడ  విచిత్రం ఏంటంటే.. ఆ కత్తి తన శరిరీంలో ఉన్న సంగతి కూడా అతనికి తెలియదు. తాజాగా ఆ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాకయ్యాడు.  అసలేం జరిగిందంటే.. ఫిలిప్పిన్స్‌కు చెందిన కెంట్ ర్యాన్ (36) అనే వ్యక్తిపై దాదాపు 15 నెలల క్రితం కొంత మంది యువకులు దాడి చేశారు. కత్తితో అతని చాతి భాగంలో పొడిచి, గాయపరిచారు. ఈ క్రమంలో కత్తి విరిగిపోయింది. కత్తికి సంబంధించిన చిన్న ముక్క అతని చాతిభాగంలో ఉండిపోయింది. కాగా.. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న కెంట్‌ను కొందరు ఆసుపత్రికి తరలించారు.



ఆసుపత్రిలో కెంట్‌ను పరీక్షించిన డాక్టర్.. కనీసం ఎక్స్ రే కూడా తీయకుండా.. గాయాలకు కుట్లేసి అతన్ని ఇంటికి పంపించేశాడు. ఈ క్రమంలో 15 నెలలుగా కెంట్.. కత్తి ముక్కను చాతిలోనే పెట్టుకుని తిరిగేశాడు. అయితే ఓ ఉద్యోగం కోసం కెంట్.. తాజాగా ఆసుపత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే ఎక్స్ రే కూడా తీయించుకున్నాడు. అనంతరం ఎక్స్ రే రిపోర్టును చూసి కెంట్ కంగుతిన్నాడు. తన చాతి భాగంలో కత్తిముక్క ఉండటంతో ఒక్కసారిగా షాకయ్యాడు. ఈ సందర్భంగా కెంట్  స్పందిస్తూ.. కత్తి ముక్కను శరీరం నుంచి తీయించుకునే వరకు ఉద్యోగంలో చేరనని చెప్పాడు. వచ్చే నెలలో ఆసుపత్రి వెళ్లి.. శస్త్రచికిత్స ద్వారా ఆ కత్తిముక్కను తీసేయించకోనున్నట్టు తెలిపాడు. 


Updated Date - 2021-03-28T01:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising