ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీరింగ్ వదిలేసి కారుపై స్టంట్స్.. యూపీ పోలీస్ రివార్డు!

ABN, First Publish Date - 2021-03-16T19:18:35+05:30

నడుపుతున్న కారు స్టీరింగ్ వదిలేసి టాప్ ఎక్కి స్టంట్స్ చేసిన ఓ యువకుడికి ఉత్తరప్రదేశ్ పోలీసులు అదిరిపోయే రివార్డు అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడుపుతున్న కారు స్టీరింగ్ వదిలేసి టాప్ ఎక్కి స్టంట్స్ చేసిన ఓ యువకుడికి ఉత్తరప్రదేశ్ పోలీసులు అదిరిపోయే రివార్డు అందించారు. `మీ హార్డ్ వర్క్‌కి ఇదిగో మా రివార్డ్` అంటూ భారీ ఫైన్ విధించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉజ్వల్ యాదవ్ అనే యువకుడు ఇటీవల రన్నింగ్ కార్‌పై ప్రమాదకర స్టంట్స్ చేశాడు. కదులుతున్న కారు స్టీరింగ్ వదిలేసి టాప్ పైకి ఎక్కి పుష్-అప్స్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.



ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 61 వేల మంది వీక్షించారు. ఈ వీడియో యూపీ పోలీసుల కంట కూడా పడింది. దీంతో వారు ఉజ్వల్ యాదవ్‌కు భారీ జరిమానా విధించారు. `కొన్ని విషయాలు మిమ్మల్ని చట్టం దృష్టిలో పడేస్తాయ్` అని పేర్కొంటూ జరిమానా విషయాన్ని పోలీసులు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు.. `నా పేరు ఉజ్వల్ యాదవ్. నేను కారుతో ఓ ప్రమాదకరమైన వీడియో చేశాను. భవిష్యత్తులో ఇలాంటివి ఇంకెప్పుడూ చేయన`ని ఉజ్వల్ చేతో మరో వీడియో చేయించి విడుదల చేశారు. 

Updated Date - 2021-03-16T19:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising