ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి.. దానిని చూసి, కంగుతిన్నాడు.. ఆ విచిత్రమైన జీవిని బయటకు తెచ్చేందుకు నానాతంటాలు పడ్డాడు.. అదేంటో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు!

ABN, First Publish Date - 2021-10-24T17:38:12+05:30

ఏదైనా నది, లేదా చెరువు దగ్గరకు వెళ్లి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏదైనా నది, లేదా చెరువు దగ్గరకు వెళ్లి చేపలు పట్టాలని చాలామంది తెగ ముచ్చటపడుతుంటారు. తాము వేసిన ఎరకు ఏదైనా చేప చిక్కితే ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. చేపకు బదులు ఎరకు ఇంకేదైనా చిక్కితే వారికి ప్రాణాలుపోయినంత పనవుతుంది. తాజాగా నెదర్లాండ్స్‌కు చెందిన ఒక వ్యక్తికి ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మార్టిన్ గ్లెట్జ్ అనే వ్యక్తి చేపలను పట్టేందుకు నది దగ్గరకు వెళ్లాడు. కొద్దిసేపటికి అతని ఫిషింగ్ రాడ్‌కు ఏదో బలంగా తగిలింది.


దీంతో పెద్ద చేప పడివుంటుందని సంబరపడిపోయాడు. ఎంతో శ్రమకోర్చి దానిని బయటకు తీశాడు. దానిని చూసి కంగుతిన్నాడు. దానికి కారణం అటువంటి చేపను ఎవరూ ఎన్నడూ చూసి ఉండరు. అది పసుపురంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అది రేర్ క్యాట్ ఫిష్.. సాధారణంగా ఇవి గోధుమ వర్ణంలో ఉంటాయి. అయితే ఇప్పుడు కనిపించిన క్యాట్ ఫిష్ పసుపు రంగులో ఉంది. ఇది 2.7 మీటర్ల పొడవు కలిగివుంది. ఈ సందర్భంగా మార్టిన్ గ్లెట్జ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎప్పుడూ ఇటువంటి పసుపుపచ్చని చేపను చూడలేదని, ఇది అరుదైన చేప అని తెలిపారు. ఇది జెనెటిక్ డిజార్డర్ కారణంగా పసుపురంగులో ఉన్నదన్నారు. 

Updated Date - 2021-10-24T17:38:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising