ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోటల్‌ గదిలో దారుణ హత్య.. మొండెం వదిలేసి తల తీసుకెళ్లిన వ్యక్తి.. అలా ఎందుకు చేశాడో తెలిస్తే..!

ABN, First Publish Date - 2021-12-15T21:54:57+05:30

మథేరన్‌.. మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం.. వారంతంలో అక్కడకు చాలామంది టూరిస్టులు వెళ్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మథేరన్‌.. మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం.. వారంతంలో అక్కడకు చాలామంది టూరిస్టులు వెళ్తుంటారు. శని, ఆది వారాలు ఆ ప్రాంతమంతా పర్యాటకులతో సందడిగా ఉంటుంది. గత ఆదివారం ఆ ప్రాంతంలో జరిగిన ఓ ఘాతుకం అందరినీ భయ కంపితులను చేసింది. రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న లాడ్జిలో మహిళ శవం తల లేకుండా కనిపించడంతో అందరూ భయాందోళనలకు లోనయ్యారు. ఆమె ఒంటిపై నూలుపోగు కూడా లేదు. ఆ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. ఎందుకంటే నిందితుడు ఒక్క సాక్ష్యం కూడా దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. అయినా పోలీసులు హంతకుడిని కనిపెట్టేశారు. ఆ మహిళను ఆమె భర్తే కిరాతకంగా హత్య చేశాడని తేల్చారు. 


ఉత్తరప్రదేశ్‌‌లోని పన్వేల్‌కు చెందిన పూనమ్‌కు, రాంపాల్‌కు ఈ ఏడాది మేలో వివాహమైంది. పూనమ్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తుండేది. భార్యపై రాంపాల్ అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం పెను భూతంగా మారి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకు మథేరన్‌ను ఎంచుకున్నాడు. అప్పటికే రెండుసార్లు మథేరన్‌‌కు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. గత ఆదివారం భార్యను తీసుకుని రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న లాడ్జికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆమె ఎవరో, ఏంటో తెలియకూడదని ఆమె ఒంటి మీద బట్టలు, ఆమెకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్లిపోయాడు. అంతేకాదు ఆమె తలను, టాటూ ఉన్న చేతిని కూడా నరికేసి పట్టుకెళ్లిపోయాడు. లాడ్జిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించగా వారిద్దరూ మాస్క్‌లు వేసుకుని ఉన్నారు. 


ఎట్టి పరిస్థితుల్లోనూ తమనెవరూ గుర్తు పట్టుకుండా ఉండేందుకు నిందితుడు సకల జాగ్రత్తలూ తీసుకున్నాడు. దీంతో పోలీసులకు ఆ కేసును ఛేదించడం కష్ట సాధ్యంగా మారింది. అయితే ఆ ప్రాంతానికి 50 మీటర్ల దూరంలో దొరికిన హ్యాండ్ బ్యాగ్ కారణంగా నిందితుడి ఆచూకీ పోలీసులకు లభ్యమైంది. ఆ బ్యాగ్‌లో ఆధార్ కార్డు ఆధారంగా అడ్రెస్ పట్టుకుని వెళ్లిన పోలీసులు అసలు విషయం కనుగొన్నారు. ఆ మహిళ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదని తెలిసింది. మథేరన్‌లో చనిపోయిన మహిళ, ఈమె ఒకరేనని తేలింది. ఆమె భర్తను విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-12-15T21:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising