ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెస్టారెంట్‌లో ఫ్రెండ్స్ ముందు గాళ్‌ఫ్రెండ్ చేసిన పనికి షాకైన వ్యక్తి.. అవమానంగా భావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్

ABN, First Publish Date - 2021-10-09T22:13:37+05:30

ఓ వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌ను వెంటబెట్టుకుని తాజాగా రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఆమె చేసిన పనికి అతడు అవాక్కయ్యాడు. అంతేకాకుండా అవమానంగా ఫీల్ అయ్యాడు. తాజాగా ఆ షాకింగ్ ఘట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌ను వెంటబెట్టుకుని తాజాగా రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ ఆమె చేసిన పనికి అతడు అవాక్కయ్యాడు. అంతేకాకుండా అవమానంగా ఫీల్ అయ్యాడు. తాజాగా ఆ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆవేదనను వ్యక్త పరిచాడు. ప్రస్తుతం అతడు పెట్టిన పోస్ట్ నెటింట వైరల్ అయింది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే వివారాల్లోకి వెళితే..


మలేషియాకు చెందిన ఓ వ్యక్తి.. తాజాగా రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్ కోసం రెస్టారెంట్‌కు వెళ్లాడు.  రెస్టారెంట్‌కు తన గాళ్‌ఫ్రెండ్‌ను సైతం పిలిచిన అతడు.. తన ఫ్రెండ్స్‌కు ఆమెను పరిచయం చేశాడు. పరిచయ కార్యక్రమం పూర్తైన తర్వాత.. ఫుడ్‌ను ఆర్డర్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి తన గాళ్‌ఫ్రెండ్ ఒక్కసారిగా షాకిచ్చింది. మెనూను పరిశీలించిన ఆమె.. తనకు ఫీష్, చిప్స్ కావాలని కోరింది.



దీంతో కంగుతిన్న అతడు.. వాటి ధర చాలా తక్కువని.. మరేదైనా ఆర్డర్ చేయాలంటూ ఆమెకు ఓ డిష్‌ను సూచించాడు. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన రిప్లైకి అతడి మైండ్ బ్లాక్ అయింది. ‘నువ్వు చెప్పిన డిష్‌కు ధర చాలా ఎక్కువ. అది నాకు వద్దు’ అని బదులివ్వడంతో సదరు బాయ్‌ఫ్రెండ్‌కు ఫ్యూజలు ఎగిరిపోయాయి. కాగా.. దీన్ని అవమానంగా భావించిన అతడు.. ఫేస్‌బుక్ వేదికగా తన ఆవేదనను వ్యక్త పరిచాడు. ‘ఫ్రెండ్స్ ముందు నా గాళ్‌ఫ్రెండ్ పరువు తీసింది’ అని పేర్కొంటూ జరిగిన విషయాన్ని వివరించాడు. కాగా.. అతడు పెట్టిన పోస్ట్ కాస్తా వైరల్ అవడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘డబ్బులను పొదుపు చేసే గాళ్‌ఫ్రెండ్ దొరికినందుకు సంతోష పడటం మాని.. ఎందుకు బాధపడతావ్ బ్రదర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. 




Updated Date - 2021-10-09T22:13:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising