ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్ పెళ్లిపిలుపు.. శుభలేఖపై క్యూఆర్ కోడ్...!

ABN, First Publish Date - 2021-01-19T02:06:52+05:30

కొత్తగా పెళ్లైన జంటకు నగదును గిఫ్ట్‌గా ఇవ్వాంటే ఏం చేస్తాం..? కొంత మొత్తాన్ని ఓ ఎన్వలప్‌లో పెట్టి ఇస్తాం..! ఇది ఎప్పటినుంచో కొనసాగుతున్న పద్ధతి. అయితే.. మధురైకి చెందిన ఓ కుటుంబం మాత్రం నగదు బహుమానాల కోసం ఓ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా పెళ్లైన జంటకు నగదును గిఫ్ట్‌గా ఇవ్వాలంటే ఏం చేస్తాం..? కొంత మొత్తాన్ని ఓ ఎన్వలప్‌లో పెట్టి ఇస్తాం..! ఇది ఎప్పటినుంచో కొనసాగుతున్న పద్ధతి. అయితే.. మధురైకి చెందిన ఓ కుటుంబం మాత్రం నగదు బహుమానాల కోసం ఓ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పెళ్లి శుభలేఖపై ఏకంగా ఓ క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. దీన్ని స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్ పే ద్వారా కానీ నేరుగా నగదును బదిలీ చేయవచ్చు. కరోనా ఆంక్షల కారణంగా పెళ్లికి రాలేకపోయిన వారి సౌకర్యార్థం ఈ ఆలోచన చేశామని పెళ్లి కూతురి కుటుంబం చెప్పుకొచ్చింది. ‘ఇప్పటికే 30 మంది ఈ సౌకర్యాన్ని వినియోగించి పెళ్లి కూతురికి కానుకగా నగదును బదిలీ చేశారు’ అని పెళ్లి కూతురి తల్లి జయంతి చెప్పారు. ‘ఇటువంటిది మా కుటుంబంలో ఇంత వరకూ ఎవరూ చేయలేదు’ అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మదురైలో ఆదివారం నాడు పెళ్లి వేడుక జరిగింది. ఇక పెళ్లి శుభలేఖ మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Updated Date - 2021-01-19T02:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising