ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రంలో కూలిన హెలికాప్టర్...12 గంటలపాటు ఈతకొడుతూ ఒడ్డుకు చేరిన మంత్రి

ABN, First Publish Date - 2021-12-23T13:25:39+05:30

హిందూ మహాసముద్రంలో తమ హెలికాప్టర్ కూలిపోవడంతో మడగాస్కర్ మంత్రి సెర్జ్ గెల్లె సురక్షితంగా 12 గంటల పాటు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంటాననారివో: హిందూ మహాసముద్రంలో తమ హెలికాప్టర్ కూలిపోవడంతో మడగాస్కర్ మంత్రి సెర్జ్ గెల్లె సురక్షితంగా 12 గంటల పాటు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్న అరుదైన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. హెలికాప్టర్ సముద్రంలో కూలిన తర్వాత అందులో ఉన్న 57 ఏళ్ల వయసు గల మంత్రి సెర్జ్ గెల్లె అత్యంత ధైర్యసాహసాలు చూపించి ఈతకొడుతూ ఒడ్డుకు చేరి హీరోగా నిలిచారు. మంత్రి చూపించిన అసాధారణ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసించారు.మడగాస్కర్ దేశంలో చాలామంది గెల్లె ఫీట్ ను అభినందించారు. 


‘‘హెలికాప్టరులో మేం నలుగురం ఉన్నాం, నేను పైలెట్ వెనుక కూర్చున్నాను. లైఫ్ జాకెట్ లేకపోవడంతో నేను సీటును విప్పి దాన్ని ఉపయోగించాను, నా బూట్లు, బెల్టు, ఇతర బరువైన వస్తువులను తీసేసి ఈదటం ప్రారంభించాను. 12 గంటల పాటు సముద్రంలో ఈది ఒడ్డుకు చేరుకున్నాను. ఈ ప్రమాదంలో నా సెల్ ఫోన్ పోగొట్టుకున్నాను’’ అని మంత్రి సెర్జ్ గెల్లె ట్వీట్ చేశారు. మరణం నాకు రానందుకు దేవుడికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. హెలికాప్టరులో తనతో పాటు ఉన్న స్నేహితులు బతికి ఉన్నారో లేదో తెలియదు కాబట్టి తాను విచారంగా ఉన్నానని మంత్రి చెప్పారు. 


సముద్రంలో రెస్క్యూ సిబ్బంది కల్నల్ మృతదేహాన్ని వెలికితీశారు. ఆలివర్ ఆండ్రియాంబినినా, ప్రధానమంత్రి భద్రత డైరెక్టర్, పైలెట్లు కనిపించకుండా పోయారు. హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం తెలియరాలేదని, గాలి వాన వల్లే హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 


Updated Date - 2021-12-23T13:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising